YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దిగొచ్చిన గులాబీ సర్కార్... కేంద్రం లోగో

దిగొచ్చిన గులాబీ సర్కార్... కేంద్రం లోగో

న్యూఢిల్లీ, డిసెంబర్ 17, 
బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ.. అచ్చం ఇదే ప‌ద్యాన్ని త‌ల‌పించేలా ఉంది ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికారంలో ఉన్న తెరాస ప్ర‌భుత్వం ప‌రిస్థితి. ఇన్నాళ్లు నాకెవ‌రూ పోటీ లేదు అని దూకుడు ప్ర‌దర్శించిన నేత‌లు.. వ‌రుస ఓట‌ముల‌తో ఉన్న‌ట్లుండి సైలెంట్ అయ్యారు. అంతేకాదు.. ఆ పార్టీ తీరులో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి.ఇటీవ‌ల సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్ర‌ధాని మోదీ, అమిత్‌షాల‌ను క‌లిసొచ్చారు. ఆ త‌రువాత బీజేపీపై టీఆర్ఎస్ నేత‌లు ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోవ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దానికితోడు తాజాగా హైద‌రాబాద్‌లో ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూం ఇండ్ల వ‌ద్ద ఏర్పాటు చేసిన బోర్డుపై తెలంగాణ ప్ర‌భుత్వం, జీహెచ్ ఎంసీ లోగోతో పాటు కేంద్ర ప‌థ‌క‌మైన ప్ర‌ధాన ‌మంత్రి ఆవాస్ యోజ‌న లోగోను ఏర్పాటు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఎన్నో డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లో ప్రారంభించిన ఇళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం లోగో పెట్ట‌లేదు. ఉన్న‌ట్లుండి వ‌న‌స్థ‌లిపురంలో ప్రారంభించిన ఇళ్ల వ‌ద్ద ఈ లోగో ప్ర‌త్య‌క్షం కావ‌టంతో అంద‌రూ అవాక్క‌వుతున్నారట‌.దుబ్బాక ఉప ఎన్నిక‌లు, జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌కు బీజేపీ గ‌ట్టిషాక్‌ను ఇచ్చింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల వార్ సాగింది. డ‌బుల్ బెడ్‌రూంల ప‌థ‌కం నిధుల్లో కేంద్రం వాటా కూడా ఉంద‌ని బీజేపీ నేత‌లు వాదించ‌గా.. అందుకు టీఆర్ ఎస్ నేత‌లు కౌంట‌ర్ ఇస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఒక‌రిపై ఒక‌రు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఎన్నిక‌ల అనంత‌రం సీన్ మారిపోయింది. బీజేపీ నేత‌లు తెరాస ప్ర‌భుత్వంపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నా.. తెరాస నేత‌లు మౌనంగా ఉంటుండ‌టం.. అదీ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌రువాత ఇలా జ‌రుగుతుంద‌టం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.అయితే ప్ర‌స్తుతం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు ఎల్‌బీ న‌గ‌ర్ ఏరియాలోని వ‌న‌స్థ‌లిపురం ప్రాంతంలోనివి. ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల్లో ఎల్బిన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక స్థానాలు బీజేపీ కార్పొరేట‌ర్లు గెలుపొందారు. ఈక్ర‌మంలో స్థానిక కార్పొరేట‌ర్ల ఒత్తిడి మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌క‌మైన ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం లోగోను ఏర్పాటు చేసిన‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఏదిఏమైనా మొత్తానికి వ‌రుస ఎన్నిక‌ల్లో షాక్ త‌గ‌ల‌డంతో సీఎం కేసీఆర్ త‌న రూట్‌ను మార్చుకున్న‌ట్లు ప్ర‌చారం

Related Posts