YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీపీసీసీ... హై డ్రామా...

టీపీసీసీ... హై డ్రామా...

న్యూఢిల్లీ, డిసెంబర్ 17, 
తెలంగాణ పీసీసీ పదవి ఎవరికి వరిస్తుందా అన్న హై డ్రామా కొనసాగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. పీసీసీ పదవిని చేపట్టే అన్ని అర్హతలు తనకు ఉన్నాయని ముందు నుండి బలంగా వాదిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అదే విషయాన్ని సోనియాను చెప్పారు. పీసీసీ పగ్గాలను ఆశిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లారు. రాహుల్ గాంధీని ఆయన కలవనున్నారు. పీసీసీ పదవిని తనకు ఇవ్వాలని రాహుల్ ను ఆయన కోరనున్నారు.  తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఒక‌రికి ఒక‌రు గోతులు త‌వ్వుకుంటున్నారనే కథనాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ లీడ‌ర్ల‌తో లాబీయింగులు మొద‌లు పెట్టారని అంటున్నారు. ఐకమత్యం విషయాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డికి ఉన్న ఫాలోయింగ్ ను చూస్తున్న కాంగ్రెస్ లోని సీనియర్లు.. అతడికి పదవి ఇవ్వకండి అని అంటున్నారు. మాలో ఎవ‌రో ఒకరికి ఇవ్వండి.. కుదిరితే నాకే ఇవ్వండి అంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్లు. కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి, లేదంటే రేవంత్ రెడ్డి.. వీరిద్దరిలో ఒక‌రికి ప‌ద‌వి వ‌స్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ సంకేతాలను కొద్దిరోజుల కిందటే ఇచ్చింది. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణికం ఠాగూర్ ఇటీవల‌ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని.. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఆయన అన్నారుఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామని.. అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని.. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరికైనా పీసీసీ ఎంపిక ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చని సూచించారు.

Related Posts