YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మరో దిశ ఘటన

మరో దిశ ఘటన

హైదరాబాద్, డిసెంబర్ 17
హైదరాబాద్‌లో రోజురోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది. పోలీసులు, ప్రభుత్వం  ఎన్నికఠిన చట్టాలు తీసుకుంటున్న అమ్మాయిలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా భాగ్యనగరంలో దిశ తరహా మరో ఘటన చోటు చేసుకుంది.రాత్రి 10.15 గంటల వేళ  ఆటో ఎక్కి గమ్యస్థానానికి తీసుకెళ్లాలని కోరిన మహిళపై ఓ ఆటో డ్రైర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించడంతో... అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హతమార్చాడు. ఈ  ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి పహాడీషరీఫ్‌  ఠాణాలో బుధవారం మీడియాకు వెల్లడించారు. పహాడీషరీఫ్‌ ఠాణా పరిధి జల్‌పల్లి పెద్దచెరువు వద్ద ఈనెల 7న మహిళ మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో  వెంటనే సంఘటనా స్థలానికి సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఐ అర్జునయ్య చేరుకొని కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన ఒక  ఆటోను దాని నెంబర్ ఆధారంగా గుర్తించారు. ఆటో కంచన్‌బాగ్‌కు చెందిన మొహ్మద్‌ ఫిరోజ్‌(23)ను నిందితుడిగా తేల్చారు. మహిళ ఎవరన్నది తేలకపోవడంతో నిందితుడు చెప్పిన ఆధారాల ప్రకారం ఊహా చిత్రాన్ని గీయించారు.ఆ చిత్రం ఆధారంగా ఇంటింటికి వెళ్లి పోలీసులు ఇంక్వైరీ చేశారు. ఆ తర్వాత చిట్టచివరకు ఆ చిత్రం ఆధారంగా, మృతురాలిని చాంద్రాయణగుట్ట  మహ్మద్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమె భర్త మరణించడంతో, ఇళ్లల్లో పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. ఈనెల 6న, బాబానగర్‌లో ఉండే సోదరి ఇంటికి వెళ్లింది. రాత్రి  10.15 గంటలకు తిరుగు పయన మయింది. రోడ్డుపై నిలిచి ఉన్న ఆటో వద్దకు వెళ్లి చాంద్రాయణగుట్ట వెళ్లాలని కోరింది. డ్రైవర్‌ ఫిరోజ్‌ అప్పటికే మద్యం తాగి ఉన్నాడుచాంద్రాయణగుట్ట  వద్ద ఆటోను ఆపకుండా జల్‌పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెద్దచెరువు సమీపం పొదల చాటున ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె
ప్రతిఘటించడంతో స్క్రూ డ్రైవర్‌తో  మెడపై గుచ్చి తలపై ఇటుక తో మోది హతమార్చాడు. రక్తపు మరకలను చెరువులో కడుక్కొని పారిపోయాడు. దిశ ఘటన తర్వాత ప్రభుత్వాలు అత్యాచార ఘటనకు పాల్పడిన వారిపై కఠిన శిక్షలు విధించేందుకు చట్టాలు తీసుకువచ్చిన పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఎక్కడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సభ్యసమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. 

Related Posts