YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేవుడి దయతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంత్రి వ్యాఖ్యాలు వైరల్

దేవుడి దయతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంత్రి వ్యాఖ్యాలు వైరల్

హైదరాబాద్ డిసెంబర్ 17

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన నర్మ గర్భ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి ఆ మేరకు ఒక వీడియో వైరల్ అవుతోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందరికి రావని, కట్టెటివి చాలా తక్కువని ఆయన వ్యాఖ్యానించారు. అవి కూడా లాటరీలో ఇస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వము కూడా లక్షల్లో ఇండ్లు కట్టివ్వదని, దరఖాస్తులు పెట్టుకొని తిరగొద్దని అన్నారు. దేవుని దయ ఉంటే వచ్చే లాటరీలో వస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు. స్తోమత ఉన్న వారు ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టుకోండని మంత్రి హితవు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Related Posts