అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని రాజధాని రైతులు 365 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప పెర్కొన్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం అవహేళన చేస్తోంది రాజప్ప మండిపడ్డారు. రాజధాని కోసం తమ ప్రాణ సమానమైన భూములను రైతులు త్యాగం చేశారని జగన్ వ్యక్తిగత ద్వేషం, ధనదాహంతో జగన్ రెడ్డి అమరావతిని చంపేస్తున్నారని రాజప్ప అన్నారు.
కేవలం జగన్మోహన్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజుకి అనగా డిశంబర్ 17 నాటీకీ అమరావతి కోసం రైతుల ఉద్యమం 365 రోజులకు చేరుకోందని అయన అన్నారు. అమరావతి రైతులకు సంఘీభావంగా చినరాజప్ప అధ్వర్యంలో పెద్దాపురం పట్టణం జగ్గంపేట రోడ్డు జంక్షన్ (గుర్రాల సెంటర్) నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దర్గా సెంటర్, శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి వీధి, పెద్దాపురం మెయిన్ రోడ్డు మీదుగా మున్సిపల్ సెంటర్, మహారాణి కళాశాల, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి గుడి (పెద్ద ఆంజనేయ స్వామి గుడి), మఠం సెంటర్, క్లాక్ టవర్ జంక్షన్ మీదుగా సామర్లకోట పట్టణ రైల్వే స్టేషన్ వద్ద ర్యాలీ ముగిసినది.