YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త పద్దతుల్లో గంజాయి రవాణా

కొత్త పద్దతుల్లో గంజాయి రవాణా

విశాఖలో గంజాయి రవాణాకు అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.గంజాయి సరఫరాతో పాటు వినియోగంలోనూ విశాఖ కేంధ్రంగా మారుతోంది.గంజాయిని తరలిస్తూ పట్టుబడిన కేసులు వరుసగా నమోదువుతున్నాయి. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకునేందకు అధికారులు అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. మాఫియా మాత్రం నిరంతరం తన ప్రణాళికలు మారుస్తూ కొత్త కొత్త మార్గాల ద్వారా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను రవాణా చేస్తున్నారు.ఇప్పటి వరకు మూడు ఎన్డీపీఎస్ కేసులను డిటెక్ట్ చేశామని ఎస్ఈబీ ఏడీసీపీ అజిత చెప్పారు. నేరుగా గంజాయి తెస్తే సమయ్య అవుతుందని భావించిన స్మగ్లర్లు.. గంజాయి నుంచి ఆయిల్ తయారు చేసి తరలిస్తున్నారని అజిత వెల్లడించారు. అలా విశాఖ ఏజెన్సీ నుంచి ఆయిల్ తెస్తూ యువతకు ఎర వేస్తున్నారని చెప్పారు. తాజాగా దువ్వాడలో గ్యాస్ సిలిండర్, ఆటో సీటు కింద గంజాయి పెట్టి తరలించడాని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఏడీసీపీ అజిత తెలిపారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్లో తరలిస్తున్న మరో 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. హైదరాబాద్కు చెందిన యువకులను అరెస్ట్ చేశామన్నారు. గాజువాక జింక్ గేట్ వద్ద 138 బాటిళ్ల నకిలీ లిక్కర్ను కూడా సీజ్ చేశామన ఆమె చెప్పారు.

Related Posts