ప్రముఖ పండితుడు, ఎపిగ్రఫిస్టు, శ్రీవారి ఆలయ మొదటి పేష్కార్ సాధు సుబ్రమణ్యశాస్త్రి 131వ జయంతి గురువారం తిరుపతిలో ఘనంగా జరిగింది.
సుబ్రమణ్యశాస్త్రి తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అన్నమయ్య కీర్తనల భాండాగారం నుంచి చాలా రాగి రేకులను వెలికితీసి కీర్తనలను వెలుగులోకి తెచ్చారు.
ఈ సందర్భంగా శ్వేత భవనం ఎదురుగా గల సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి శ్వేత సంచాలకులు డా. రామాంజులరెడ్డి, హెచ్ డిపిపి కో ఆప్షన్ సభ్యుడు పెంచలయ్య, ఏఇఓ జగదీశ్వరి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. విభీషణ శర్మ పుష్పాంజలి ఘటించారు.