బాంబులకే నేను భయపడలేదు.. వీరి తాటాకు చప్పుళ్లకు భయపడతానా. పోరాడకపోతే... భవిష్యత్తు లో బానిసలుగా మిగిలిపోతారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుఅన్నారు. అమరావతి ఆడబిడ్డలు ఈ ఉద్యమానికి ఒక స్పూర్తి. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజలు అంతా పోరాటం చేయాలి. అధికారం నాకు కొత్త కాదు.. ఇప్పుడు అధికారం కోసం ఇలా చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు న్యాయం జరగాలి, రైతుల వ్యధను గుర్తించాలి. 365రోజులలో ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. పోలీసులు ఈడ్చేసినా, కేసులు పెట్టినా మహిళలు భయపడలేదని అన్నారు.
నేను వెంకన్నను, దుర్గమ్మ ను కోరుకున్నా. అన్యాయం చేస్తే... వెంకన్న ఈ జన్మలోనే వారికి బుద్ధి చెబుతారు. నా కోసం కాదు... రాజధాని కోసం, రాష్ట్రం కోసం కోరుకున్నా. భావితరాల భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకున్నా. రాష్ట్రం లో మనసున్నవారంతా ఒక్కసారి ఆలోచించండి. అబ్దుల్ సలాం విషయంలో ఎంత నీచంగా మాట్లాడారో. అలాంటి అవమానం భరించలేక కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నారని అయన అన్నారు. దీని పై సిఎం ఏం చర్యలు తీసుకున్నారో .. ఆలోచించండి. మరోచోట మైనారిటీ మహిళ ఆత్మహత్య చేసుకుంటే.. కుటుంబం సభ్యులు బెదిరించారు. చీరాలలో మాస్క్ పెట్టుకోకపోతే ఇక యువకుడి చావుకు కారణమయ్యారు. మరి మాస్క్ పెట్టుకోని జగన్మోహన్ రెడ్డి ని కూడా శిక్షించాలి కదా. రాష్ట్ర వ్యాపార ఆలయాలను కూలగొడితే చర్యలు లేవు. మరి పోలీస్ బాస్ మాత్రం ఏవేవో చెబుతారు.. నిందితులును పట్టుకోలేరు. పోలీసు వ్యవస్థ ను నడిపే అజ్ఞాత శక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మాఇంటికి తాడులు కట్టి నన్ను అడ్డుకుంటారా. పోలీసులు చట్ట పరంగా పనిచేయాలి కానీ, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. అన్యాయాన్ని ప్రశ్నించాలని అన్నారు.