తిరుపతి, డిసెంబర్ 18,
తిరుపతి ఎంపీ సీటు ఎవ్వారం.. ఇప్పుడు బీజేపీ, జనసేనలో ఇష్యూ గా మారింది. జనసేన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇన్నాళ్లూ కామ్ గానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం జెండా ఎగరేయడానికి రెడీ అయ్యారు. మొన్న గ్రేటర్ ఎన్నికల్లో కూడా చెప్పా పెట్టకుండా సడన్ గా పోటీ నుంచి విరమించుకోవడంపై జనసేన క్యాడర్ డిసప్పాయింట్ అయింది. అప్పటి నుంచే జనసేనాని కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ.. బీజేపీ లీడర్లు మాత్రం తమ మౌనాన్ని చేతకాని తనంగా చూస్తున్నారు అని.. జనసైనికులు ఫీలైపోతున్నారట. సోము వీర్రాజులాంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులే పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తారు.. మన లీడరే పోటీ చేస్తారు అని చెప్పడంపై గుర్రు గుర్రుమంటున్నారట. ఇంకో అడుగు ముందుకేసి.. జేపీ నడ్డా దగ్గర పవన్ కల్యాణ్ ఒప్పుకున్నారు. వారు పోటీ చేయరు మనకి ప్రచారం చేస్తారు అని చెప్పడంతో.. జనసేన అగ్రస్థాన లీడర్లు ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారట. మనం సపోర్ట్ చేస్తా ఉంటే.. వాళ్లు పోటీ చేస్తా ఉంటారా.. జనసేన ఇక్కడ బీజేపీకి ప్రచారం చేయబడును.. అని బోర్డు ఏమైనా పెట్టుకున్నామా అంటున్నారట. ఇక పవన్ కల్యాణ్ కూడా దీనిపై సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. బయటికి రాకపోయినా.. లోపల మాత్రం పాలిటిక్స్ స్పీడ్ గానే జరుగుతున్నాయట. తిరుపతి ఎంపీ సీటుకి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై ఓ కమిటీ వేసింది జనసేన. ఐదారుగురు ఇంటలెక్చువల్స్ ఈ కమిటీలో ఉండి.. ఎవరు పోటీ చేస్తే బావుండు అని ఫైనల్ చేస్తారట. దాన్ని జనసేనాని అప్రూవ్ చేస్తారు. అందుకే.. రిటైర్డ్ ఐఏఎస్ లు.. ఐపీఎస్ లు, మేథావి వర్గం లీడర్లు.. తిరుపతిలో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారట. పవన్ కల్యాణ్ నిర్ణయం ఇప్పుడు బీజేపీలో టెన్షన్ పుట్టిస్తోంది. ముందు ముందే అత్యుత్సాహంతో మనం ప్రచారం చేసుకుంటున్నాం. ఇప్పుడు వాళ్లు పోటీకి రెడీ అవుతున్నారు. జనంలో నవ్వుల పాలు అవుతామా ఏంటి అనే కన్ ఫ్యూజన్ లో పడ్డారట. మరి జనసేనాని ఈ విషయంపై అయినా స్ట్రాంగ్ గా ఉంటారా. లేదంటే.. సరె సరెలే ఎన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అంటూ.. బీజేపీకి సపోర్ట్ చేస్తారా అనే పాయింట్ కూడా డిస్కషన్స్ లో ఉంది.