కర్నూలు డిసెంబర్ 18
సీనియర్ జర్నలిస్ట్, పల్లెవెలుగు దినపత్రిక ఎడిటర్ కృపవరం ఇక లేరు అనడానికే ఇబ్బందిగా ఉంది.. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎపిడబ్ల్యూజేఫ్ కర్నూలు జిల్లా శాఖ సంతాపం ప్రకటించింది. గత 5రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని బాలాజీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందారని ఆయన మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటని ఎపిడబ్ల్యూజే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. మద్దిలేటి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె బి శ్రీనివాసులు, బి. గోరంట్లప్ప, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి. మౌలాలి, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బి. చిన్న రామాంజనేయులు,జిల్లా ఉపాధ్యక్షులు బసప్ప నగర అధ్యక్ష కార్యదర్శులు కె. మధుసూదన్, కె. నాగేంద్ర లు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.కృపవరం విద్యార్ధి దశలో ఎస్ ఎఫ్ ఐ నాయకుడిగా పని చేశారాని, అలాగే ప్రజాశక్తి దినపత్రికలో సుధీర్ఘ కాలం స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేశారన్నారు. విద్యార్ధి ఉద్యమంలో పని చేసిన అనుభవంతో పత్రికా రంగంలో జర్నలిస్టుల సంక్షేమంకోసం అదే స్ఫూర్తితో పనిచేశారన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు రావడంలో ఆయన కృషి ఎనలేనిదని కృపవరం చేసిన సేవలను కొనియాడారు.