YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దేశంలో ఇక టోల్ గేట్లు ఉండవు రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్త

దేశంలో ఇక టోల్ గేట్లు ఉండవు రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్త

న్యూ ఢిల్లీ  డిసెంబర్ 18  
వచ్చే రెండేళ్లలో దేశంలో టోల్ గేట్లు ఉండవని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రష్యా సహకారంతో టోల్ గేట్ల స్థానంలో జీపీఎస్ వ్యవస్త ప్రవేశపెడుతామని ప్రకటించారు.  కొత్తగా వచ్చే వాహనాల్లో జీపీఎస్ పనిచేస్తోంది. మిగతా వాటిల్లో ట్రాకింగ్ కిట్ అమరుస్తాం.. దాంతో వాహనం ఎన్ని కి.మీలు తిరిగిందనేది తెలుస్తుంది. దాన్ని బట్టి వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి నేరుగా టోల్ ఫీజు కట్ అవుతుంది అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రష్యాలో హిట్ అయ్యింది. అక్కడ టోల్ గేట్లను ఎత్తివేసి వాహనదారులను ఫ్రీగా వదిలిపెడుతారు. వారు ప్రయాణించిన దూరం వారి అకౌంట్ల నుంచి కట్ అవుతుంది. ఇదే దేశంలో అమలు చేయనున్నారు. రోడ్డుపై వెళితే చాలు ఇప్పుడు కొన్ని కిలోమీటర్లు వెళ్లాక టోల్ గేట్లు దర్శనమిస్తాయి. ఎక్కువ దూరం పోతే రెండు మూడు కనిపిస్తాయి. అక్కడ టోల్ కట్టి మనం రోడ్ల మీద ప్రయాణించాలి. ఇది అదనపు భారమే. కానీ తప్పదు. ఇక పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు కిలోమీటర్ల కొద్దీ వాహనాలు టోల్ గేట్ల వద్ద నిలిచిపోతుంటాయి. ఈ పరిస్థితిని తప్పించేందుకు రష్యా దేశంలో వాడుతున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

Related Posts