YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

సీఎంపై మోడల్ ఆత్యాచార ఆరోపణలు..

సీఎంపై మోడల్ ఆత్యాచార ఆరోపణలు..

ముంబై డిసెంబర్ 18  సీఎంపై మోడల్ ఆత్యాచార ఆరోపణలు.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని ఇవ్వండి  మహారాష్ట్ర డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు.
జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై ముంబయికి చెందిన ఒక మోడల్ అత్యాచార ఆరోపణలు చేశారు.దాదాపు ఏడేళ్ల క్రితం జరిగినట్లుగా చెప్పే ఒక ఉదంతానికి సంబంధించి సంచలన ఆదేశాలు తాజాగా వెలువడ్డాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తనను అత్యాచారం చేశారంటూ ఒక మోడల్ ఆరోపించటం.. దానిపై జాతీయ మహిళా కమిషన్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ఆరోపణల్ని పలు మీడియా సంస్థలు రిపోర్టు చేయగా.. సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. మీడియాలో వచ్చిన రిపోర్టుల్ని సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్ని తమకు ఇవ్వాలంటూ మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాయటం సంచలనంగా మారింది.2013లో హేమంత్ సోరేన్.. సురేశ్ నగ్రే తనపై అత్యాచారం చేసినట్లుగా ముంబయి మోడల్ చేసిన ఆరోపణల్ని మహిళా కమిషన్ పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పటంతో ఆమెకు.. ఆమె కుటుంబ సభ్యుల్ని వేధిస్తుననట్లుగా సదరు మోడల్ చేసిన ఆరోపణను తాము పరిగణలోకి తీసుకుంటున్నట్లు కమిషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. సదరు మోడల్ తనకు రక్షణ కల్పించాలని.. భద్రత కోసం రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులోని అంశాల్ని తాము పరిశీలిస్తున్నట్లు మహిళా కమిషన్ పేర్కొంది.ఏడేళ్ల నుంచి ఈ ఇష్యూ నలుగుతున్నా.. తాజాగా మోడల్ పేరిట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖ ఉదంతం తెర మీదకు వచ్చిన తర్వాత జాతీయ మహిళా కమిషన్ స్పందించటం.. మహారాష్ట్ర డీజీపీకి లేఖ రాయటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఈ తరహా ఆరోపణలు సంచలనంగా మారాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Related Posts