YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో హోసింగ్ కార్పొరేషన్ కు అరుదైన గౌరవం

డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో హోసింగ్ కార్పొరేషన్ కు అరుదైన గౌరవం

 

 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో మెరుగైన పని తీరును కనబర్చినందుకు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్‌కు అరుదైన గౌరవం దక్కింది.   పట్టణ, గ్రామీణ పేదలకు పూర్తిగా  ప్ర‌భుత్వ ఖ‌ర్చుతో సృజ‌నాత్మ‌క‌త‌, విప‌త్తుల‌ను ఎదుర్కొనేలా ప‌టిష్ట‌మైన డ‌బుల్  బెడ్ రూమ్ ఇళ్ల‌ను నిర్మించి ఇస్తున్నందుకు తెలంగాణ హౌజింగ్ కార్పోరేష‌న్ హ‌డ్కో  అవార్డు ను ప్ర‌క‌టించింది. ఢిల్లీలో హడ్కో వ్యవస్థాపక దినోత్సవం సంద‌ర్భంగా ఎప్రిల్ 25న  ఈ అవార్డును అంద‌జేయ‌నున్న‌ట్లు  హ‌డ్కోతెలిపింది. డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో మెరుగైన ప‌ని తీరు క‌న‌బ‌రుస్తున్నందుకు ఈ అవార్డు  ప్ర‌క‌టించింది.ఏడాదిలో  తెలంగాణ హోసింగ్ కార్పొరేషన్ రెండు హ‌డ్కో అవార్డులు రావడం పట్ల గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ చిత్రరామచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు 

Related Posts