YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

బెంగాల్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ డిసెంబర్ 18 
ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మ‌మ‌తా బెన‌ర్జి ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త‌మ‌పై బెంగాల్ స‌ర్కారు త‌ప్పుడు కేసులు న‌మోదు చేసి వేధిస్తున్న‌దంటూ అక్క‌డి బీజేపీ నేత‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. మ‌మ‌త స‌ర్కారుకు నోటీసులు ఇవ్వ‌డ‌మేగాక‌ 2021 జ‌న‌వ‌రిలో తాము తదుప‌రి విచార‌ణ చేప‌ట్టే వ‌ర‌కు బీజేపీ నేత‌ల‌పై ఎలాంటి బ‌వ‌లంత‌పు చ‌ర్య‌లు చేప‌ట్ట‌రాద‌ని ఆదేశాలు జారీచేసింది.ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు త‌మ‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేసిందంటూ బీజేపీ ఎంపీలు కైలాస్ విజ‌య‌వర్గీయ‌, అర్జున్‌సింగ్‌, మరికొంద‌రు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రి స‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ ప్రారంభించింది. త‌దుప‌రి విచార‌ణ 2021 జ‌న‌వ‌రికి వాయిదా వేసింది.

Related Posts