వారణాసి డిసెంబర్ 18
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రధాని మోదీ ఆఫీస్ అమ్మకానికి పెట్టారు. అవును ఆఫీస్‌కు సంబంధించిన వివరాలు, ఫొటోలతో ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో కొందరు వ్యక్తులు ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. ఆఫీస్‌ను రూ.7.5 కోట్లకు అమ్ముతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రకటనను గుర్తించిన పోలీసులు ఆ పోస్టును వెబ్‌సైట్ నుంచి తొలగించారు. ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ప్రధాని మోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రధానికి పార్లమెంటరీ కార్యాలయం ఉన్నది. దీనిని విల్లాగా పేర్కొన్న ప్రకటనకర్తలు, 6500 చదరపు గజాలున్న ఆ బిల్డింగ్‌లో నాలుగు గదులతోపాటు, నాలుగు బాత్‌రూమ్‌లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఫొటోలను లక్ష్మీకాంత్ ఓఝా పేరుతో ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటనను పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.