బీజింగ్, డిసెంబర్ 19
చైనా చేపడుతున్న మరో నిర్మాణం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. మయాన్మార్‌తో దక్షిణ సరిహద్దు వెంబడి అత్యంత పొడవైన గోడను డ్రాగన్ నిర్మిస్తున్నట్టు ఇటీవలే బయటపడింది. ముళ్లతీగలతో ఏర్పాటు చేస్తున్న ఈ కుడ్యం పొడవు 1,300 మైళ్లు (దాదాపు 2 వేల కిలోమీటర్ల) పొడవు ఉంటుందని సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలో మయాన్మార్ నుంచి అక్రమచొరబాటు దారుల్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని, అందుకే దీని నిర్మాణం చేపట్టామని చైనా ప్రకటించుకుంది. అయితే, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మాత్రం ఈ వాదనలతో ఏకీభవించడంలేదు.తిరుగుబాటుదారులు దేశసరిహద్దు దాటకుండా నిర్బంధించడానికే ప్రభుత్వం పూనుకుందని ప్రభుత్వ వ్యతిరేకులు చెబుతున్నారు.
మరోవైపు, చైనా చర్యల పట్ల అమెరికా ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ వల్ల రాబోయే దశాబ్దాల్లో దక్షిణాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇటు, చైనా తీరుపై మయాన్మార్ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి లేఖ రాసిన ఆ దేశ ఆర్మీ అధికారులు..ఇరు దేశాల మధ్య 1961లో కుదిరిన సరిహద్దు ఒప్పందం గురించి ప్రస్తావించారు.ఆ ఒప్పందం పక్రారం సరిహద్దు రేఖ వెంబడి ఇరు వైపులా 10 మీటర్ల వరకూ ఎటువంటి నిర్మాణం చేపట్టరాదు. తన చర్యలతో చైనా తాజాగా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని మండిపడ్డారు. మయాన్మార్ మీడియా కథనం ప్రకారం.. డిసెంబర్‌లో ఈ ముళ్లతీగలతో కూడిన రక్షణగోడ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయిచైనా నైరుతి యునాన్ ప్రావిన్సుల్లోని వాండింగ్ ఇరు దేశాలను వేరుచేసేలా ఇనుప కంచెతో 6 నుంచి 9 అడుగుల వెడల్పున్న గోడను నిర్మించినట్టు అమెరికా ప్రభుత్వ నిధులతో నడిచే రేడియో ఫ్రీ ఆసియా సోమవారం వెల్లడించింది. గోడ నిర్మాణం గురించి మాయన్మార్‌కు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే చైనా దుందుడుకు వైఖరి ప్రదర్శించినట్టు ఆ దేశానికి చెందిన ఇర్రావాడీ న్యూస్ సైట్ తెలిపింది.మొత్తం 1,300 మైళ్ల పొడవుతో నిర్మించే ఈ గోడను తొలి దశలో 410 మైళ్లు ఇప్పటికే పూర్తిచేసినట్టు రేడియో ఫ్రీ ఆసియా తెలిపింది. ఇక, 2022 అక్టోబరు నాటికి ఈ నిర్మాణాన్ని పూర్తిచేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుందని, దీనిపై హై-ఒల్టేజ్ ఫెన్సింగ్, సీసీకెమోరాలు, సెన్సార్లు ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొంది. చైనా మీడియా మాత్రం కరోనా వైరస్ కేసులు, విదేశాల నుంచి అక్రమ చొరబాట్లను నిరోధిస్తుందని ప్రచారం సాగించడం గమనార్హం. ఇదేనంటున్న అధికారులుఅయితే, భారీ గోడను నిర్మించాలనే నిర్ణయం ఒక్క రోజులో తీసుకుంది కాదని, పక్కా వ్యూహంతోనే చైనా ముందుకెళ్తోందని మాయన్మార్-చైనా సంబంధాల అధ్యయనకర్త వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిమిత్తం తరుచూ మాయన్మార్, వియత్నాంలను సందర్శించే చైనా పౌరులకు ఇది ఇబ్బందిగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.