YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సంక్రాంతి తర్వాత విద్యాసంస్థలు

సంక్రాంతి తర్వాత విద్యాసంస్థలు

హైదరాబాద్, డిసెంబర్ 19, 
తెలంగాణలో కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. అయితే విద్యా సంవత్సరం ముగియడానికి మరి కొన్ని నెలలు మాత్రమే మిగలడంతో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం మూడునెలలపాటు తెరవాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వం అనుమతిస్తే జనవరి నాలుగో తేదీ నుంచే  లేదా సంక్రాంతి నుంచి పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. తొలుత 9, 10 తరగతులు, జూనియర్‌ కాలేజీలలో రెగ్యులర్‌ క్లాసులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తరువాత దశల వారీగా 6 నుంచి 8, ఆ తర్వాత ప్రాథమిక తరగతులను రెగ్యులర్‌గా నిర్వహించాలని భావిస్తోంది.తమ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించామని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వెల్లడించారు. ఆన్‌లైన్‌ క్లాసుల పట్ల విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూల్‌ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారన్నారు.

Related Posts