విజయవాడ, డిసెంబర్ 19,
అధికారంలోకి నేతలు వస్తూంటారు, పోతూంటారు, దిగిపోయిన కుర్చీని అడిగితే చెబుతుంది తాను ఎంతమందిని చూసిందో. ఇక ఉమ్మడి ఏపీలోనే కాదు, దేశంలోనే ఒక అరుదైన రికార్డ్ 2020లో నమోదు అయింది. అదేంటీ అంటే జగన్ ఈ ఏడాది మొత్తానికి ఏ ఒక్క నెలనూ వదలకుండా పదుల సంఖ్యలో పధకాలను అమలు చేసిన తీరుతో దేశంలోనే నంబర్ వన్ అనిపించుకున్నారు. ప్రపంచమంతా కరోనా ప్రభావంతో కకావికలు అయినా కరెన్సీ కదిలింది మాత్రం ఒక్క ఆంధ్రాలోనే. ఎంతటి కష్టకాలంలోనూ ఏ ఒక్క పధకాన్ని ఆపకుండా కొనసాగించిన చరిత్రను జగన్ క్రియేట్ చేశారు.ఈ ఏడాది మొదట్లో అంటే జనవరిలో అమ్మ ఓడి పధకాన్ని జగన్ మొదలుపెట్టి డిసెంబర్ వరకూ పధకాలే పధకాలుగా కధ కొనసాగించారు. డిసెంబర్ నెలలో ముప్పయి లక్షల మందికి ఇళ్ళ పట్టాలతో బ్రహ్మాండమైన ముగింపుని జగన్ 2020కి ఇచ్చారు. ఈ మధ్యలో ఎన్నో పధకాలు. రైతు నేస్తం, కాపు నేస్తం, ఆరోగ్యశ్రీ అందరికీ వర్తింపచేయడం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రత్యేకంగా పధకాలు, విద్యార్ధులకు పధకాలు ఇలా ఎన్నో అమలు చేసి చూపించారు జగన్. అంతే కాదు తాను ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తొంబై శాతం అమలు చేసి జగన్ శభాష్ అనిపించుకున్నారు. రాజకీయ నేతల మీద పూర్వపు విశ్వసనీయత కల్పించారు. ఏడాది ప్రపంచానికే కష్టమంటే ఏంటో చూపించింది. కొన్ని నెలల పాటు సాగిన లాక్ డౌన్ తో ఖజానాకు పైసా కూడా ఆదాయంలేదు. మరో వైపు కేంద్రం నుంచి ఆర్ధిక సాయం పెద్దగా లేదు. విభజన ఏపీలో ఆదాయ మార్గాలు అసలు లేవు. అయినా కూడా జగన్ కరోనా పీక్స్ లో ఉన్న వేళలో కూడా ఏ ఒక్క స్కీం ని ఆపకుండా సంక్షేమ రధాన్ని కొనసాగించారు. అంతే కాదు, తాను ప్రకటించిన క్యాలండర్ ని ఆయన కచ్చితంగా అమలు చేసి తనకు ఎవరూ పోటీ కాదు అనిపించుకున్నారు. ధనిక రాష్ట్రాలు సైతం జనాలకు నగదు బదిలీ చేయని వేళలో ఏపీలో ఠంచనుగా పించన్లు ఇవ్వడమే కాదు, పధకాలతో జాతర చేసి పేదోడి ఇంట్లో లక్ష్మీ కళను తెచ్చింది మాత్రం జగనే.
ఉమ్మడి ఏపీ నుంచి నేటి వరకూ చూసుకున్నా ఒక్క ఏడాదిలో ఇన్ని పధకాలు అమలు చేసిన చరిత్ర ఎవరికీ లేదు. పైగా డబ్బులు బాగా వచ్చిన రోజుల్లో కూడా టైం కి పధకాలు జనాలకు చేరవేసే సీన్ కూడా లేదు. ఇక దేశంలో చూసుకున్నా ఏపీలో ఉన్నన్ని పధకాలు మరే రాష్ట్రంలో లేవు. ఆ విధంగా జగన్ ఒకే ఒక్కడుగా రాజకీయాల్లో ఉంటారని అంటున్నారు. 2019 ద్వితీయార్ధంలో పగ్గాలు చేపట్టిన జగన్ 2020 పూర్తి పన్నెండు నెలల్లో మాత్రం ఏ ఒక్క నెలను వేస్ట్ గా వదిలేయలేదు. ఏ ఒక్క సెక్షన్ ని అసలు పక్కన పెట్టలేదు. మొత్తానికి మొత్తం డబ్బులు తెచ్చి కుమ్మరించారు. మరి వాటి ఫలాలు అందుకున్న ప్రజలు జగన్ కి ఎలాంటి ప్రతిఫలాన్ని ఇస్తారో తెలియదు కానీ జగన్ రికార్డుని కొట్టడం సమీప భవిష్యత్తులో ఎవరికీ సాధ్యం కాదని గట్టిగా చెప్పవచ్చు.