`రాజస్థాన్‌లో జరిగిన యథార్ధ సంఘటన ఆధారంగా మూడు భాషల్లో ఒక డిఫరెంట్ థ్రిల్లర్‌గా `సమిధ` చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను` అన్నారు దర్శకుడు సతీష్ మాలెంపాటి. మర్మం, 'కనులు కలిసాయి`వంటి ఐదు షార్ట్ ఫిలిమ్స్ ని రూపొందించి ఇప్పుడు వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారాయన. సతీష్ మాలెంపాటి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషలలో రూపొందుతోన్న చిత్రం 'సమిధ`. `ఉండిపోరాదే` మూవీ ఫేమ్ అనువర్ణ, తమిళ నటి ఛాందిని హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అరుణం ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. డిసెంబర్ 23 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభంకానుంది.ఈ సందర్భంగా..
చిత్ర దర్శకుడు సతీష్ మాలెంపాటి మాట్లాడుతూ - ``సమిధ మూవీ ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ 16 వరకూ జరిగింది. ఈ షెడ్యూల్‌లో కొన్ని కీలకసన్నివేశాలు చిత్రీకరించాం. ఈ నెల 23 నుండి సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా రెండు గంటల పాటు ట్విస్ట్‌లు, టర్న్‌లతో తప్పకుండా ప్రేక్షకులని ఎంగేజ్ చేస్తుంది. చేజింగులు, యాక్షన్ సీన్స్‌తో ఆడియన్స్‌కి ఒక ఫర్ఫెక్ట్ థ్రిల్లర్ చూసిన అనుభూతినిస్తుంది`` అన్నారు.
అక్షిత్ శశి కుమార్, అనువర్ణ, ఛాందిని, రవివర్మ, పోసాని కృష్ణ మురళి, శ్రావణ్, రవికాలే, బ్లాక్ పాండీ, కేపివై బాలా, శంకర్ మూర్తి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి..సినిమాటోగ్రఫి: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఎడిటింగ్: బి. నాగేశ్వర రెడ్డి, ఆర్ట్: మురళి, నిర్మాణం: అరుణం ఫిలింస్, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సతీష్ మాలెంపాటి.