జీడిమెట్ల పోలీసుల పరిధీలో ఒక వృద్దురాలి మృతదేహం లభించింది. హెచ్ఎంటీ కంపెనీ, ఆంద్రాబ్యాంక్ వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది మృతదేహం నీటి డ్రమ్ లో ఉందని, సుమారు 60సంవత్సరాల వయస్సు ఉంటుందని, యాచకురాలుగా బావిస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు తెలిపారు. స్థానికులు నీటిడ్రమ్ లో ఉన్న మృతదేహంను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్దలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సిసి ఫూటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తామని, శుక్రవారం రాత్రి చనిపోయి ఉండొచ్చని పోలీసులు తెలిపారు.