ఏలూరు లో వింత వ్యాధి ప్రబలిన నేపధ్యంలో ఉపముఖ్యమంత్రి ఆదేశాలపై నగరంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాణ్యత లేని,నిల్వ పదార్థాలను,ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ పదార్థాలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలో ఆహారపదార్థాలు కల్తీ అవుతున్నాయని,పదార్థాలు తయారు చేసేటప్పుడు మడ్డి నూనె, రంగు విషపూరిత పదార్థాలు వాడుతున్నారని ఆయన అన్నారు. కొన్ని షాపుల్లో ఆహార పదార్థాల సాంపిల్స్ సేకరించి, పలువురు పై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.