జిల్లాలో భట్రాజుల సంఘ భవనానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి కి శనివారం భట్రాజుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. స్థానిక పొదలకూరు రోడ్డు ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు గోవర్ధన్ రెడ్డి నివాసంలో ఆయనను రాజుల సంఘం నాయకులు ఆయనకు తమ సమస్యలు విన్నవించారు .ఈ సందర్భంగా భట్రాజుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు బీసీ వెల్ఫేర్ సంఘం వైస్ ప్రెసిడెంట్ పేర్నపార్టీ శ్రీ రామరాజు మాట్లాడుతూ
ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన కులం భట్రాజు కులం అన్నారు. ఒకప్పుడు ఎంతో గొప్పగా జీవించిన సరస్వతీ పుత్రులు ఈ భట్రాజు కులం,అటు వంటి కులానికి నెల్లూరు నగరంలో స్థలం కేటాయిస్తే కులస్తూలందరూ కలిసి ఒక శాశ్వత భట్రాజు భవనాన్ని ఏర్పాటు చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో భట్రాజుల సంఘం భవన నిర్మాణాలకు సంఘం ప్రయత్నం చేస్తోందన్నారు . ఈ మేరకు ఆయా జిల్లాల పరిధిలోని సంఘ నాయకులతో కలిసి స్థానిక శాసనసభ్యులు మరియు జిల్లా కలెక్టర్లతో కలిసి వినతి పత్రాలు సర్పంచ్ ఉన్నామని చెప్పారు. ఐక్యత గా ఉంటేనే సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉంటుందని భట్రాజు సంఘం నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బి.సి.కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ పాలగిరి అల్లూరురాజు, కులసంఘం నాయకులు కె.జయరామరాజు, కె.మురళీమోహన్ రాజు,రిటైర్డ సి.ఐ.సరస్వతి సుబ్బరామరాజు, కె.లక్ష్మణరాజు తదితరులు పాల్గొన్నారు.