మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట పెళ్లి జరగాల్సి వుంది. దాని కోసం దాచుకున్న బంగారంతో పాటు నగదు కూడా భారీగా చోరీకి గురవడంతో కుటుంబీకులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్ పల్లి గ్రామంలో సింగిరెడ్డి ఇంద్రారెడ్డి ఇంట్లో మరో నాలుగు రోజుల్లో పెళ్లి వేడుక జరగనుంది. కాగా వివాహమహోత్సవానికి ఇంట్లో దాచి ఉన్న దాదాపు రెండు వందల తులాల బంగారం ఏడు లక్షల నగదు అపహరణకు గురైంది. ఇంట్లో కుటుంబీకులు అర్ధరాత్రి వరకు మేలుకొని ఉండి అనంతరం వారు నిద్రించిన తర్వాత ఇంటి కిటికీలు తొలగించి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.. కాగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో ఇలాంటి దారుణం చోటు చేసుకోవడం గ్రామంలో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది...