YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం

అంతు చిక్కని కేసీఆర్ వ్యూహం

హైదరాబాద్, డిసెంబర్ 21, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసే రాజకీయ అడుగులు ప్రత్యర్థులకు అర్ధం కావు. సొంత పార్టీ వారు సైతం బుర్రలు బద్దలు కొట్టుకునేలా ఉంటాయి. తాజాగా గులాబీ బాస్ హస్తిన యాత్ర పెద్ద హాట్ టాపిక్ నే అయ్యింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కలుసుకోవడం సర్వ సాధారణ అంశం. అయితే ఇటీవల భాగ్యనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి – టీఆరెస్ లు నువ్వా నేనా అని తలపడ్డాయి. అంతేనా ఒకరినొకరు బండ బూతులే తిట్టుకున్నాయి. దుబ్బాక ఉపఎన్నికల నుంచి ఇదే తంతు నడిచింది.ఈ రెండు ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ బిజెపి కి విసిరిన సవాళ్లు అన్ని ఇన్ని కావు. ఎల్ఐ సి ని ప్రవేటీకరణ దిశగా మోడీ సర్కార్ నడిపిస్తుంది. రైల్వే లను ప్రవేటీకరణ చేస్తుంది. ఇలా దేశానికి పట్టుగొమ్మలుగా ఉన్న సంస్థలను కార్పొరేట్ లకు కట్టబెట్టి జాతి ప్రయోజనాలను తాకట్టు పెడుతుందంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు కేసీఆర్. అందుకే ఈ ఎన్నికల్లో మా పార్టీని ఆశీర్వదించండి ఢిల్లీ వెళ్ళి సంగతి తేలుస్తా అంటూ రంకెలే వేశారు కారు పార్టీ అధినేత కేసీఆర్. ఇదంతా ఇప్పుడు ఉల్టా చేసి అందరిని ఆశ్చర్యంలో పడేశారు ఆయన.హైదరాబాద్ ఎన్నికల్లో గట్టి షాక్ నే తగిలింది గులాబీ కి. కమలం అనూహ్యంగా పుంజుకుని తెలంగాణ గడ్డలో గులాబీ కి ఖచ్చితమైన ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకుంది. ఆ ఫలితాలు చూశాక కేసీఆర్ రెచ్చిపోయి బిజెపి ని తొక్కే పనిలో నిద్రపోకుండా పని చేస్తారని అంతా అనుకున్నారు. కట్ చేస్తే ఆయన అందరు అన్నదానికి రివర్స్ లో అడుగులు వేశారు. దటీజ్ కేసీఆర్ అనిపించుకున్నారు. ఢిల్లీ టూర్ హుటాహుటిన పెట్టుకుని కేంద్ర మంత్రుల ను ప్రధానిని కలిసి తెలంగాణ కు సాయం చేయాలంటూ అభ్యర్ధించడం ఇప్పుడు కొత్త చర్చకు తెరతీసింది. కేసీఆర్ ఏం చేసినా దాని వెనుక ఎదో పరమార్ధం ఉంటుంది అదేంటో త్వరలోనే తేలిపోనుంది మరి.

Related Posts