YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సీతారామ్ కు సవాల్ గా బెంగాల్ ఎన్నికలు

సీతారామ్ కు సవాల్ గా బెంగాల్ ఎన్నికలు

బెంగాల్, డిసెంబర్ 21, 
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు దగ్గరపడే కొద్దీ రోజురోజుకూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇక్కడ పట్టు సంపాదించు కునేందుకు అన్ని పార్టీలూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇక బీజేపీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు మూడేళ్ల నుంచి బీజేపీ పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లే చెప్పాలి. కాంగ్రెస్, వామపక్షాలు కలసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.ఇప్పడు కాంగ్రెస్, వామపల కూటమిని ఆసక్తిగా ప్రజలు చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు అవుతుంది. దీంతో సహజంగానే అధికార పార్టీపై అసంతృప్తి నెలకొని ఉంది. కరోనా సమయంలో ఉపాధి కోల్పోవడం, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక మమత బెనర్జీ అభివృద్ధిపైన కన్నా రాజకీయాలపై దృష్టి పెట్టడంతో ఆమె కు మైనస్ గా మారింది. మరోవైపు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ కూడా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తుంది.నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో  కాంగ్రెస్, వామపక్షాలు కలసి ఎంత మేర సక్సెస్ అవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో రెండు పార్టీలకూ కలపి 38 శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ శాతం మరింత పెరుగుతుందని కాంగ్రెస్, వామపక్షాలు భావిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పై అసంతృప్తి, బీజేపీ పై నమ్మకం లేకపోవడం తమకు కలసి వచ్చే అంశంగా ఈ కూటమి భావిస్తుంది. బీహార్ లో కూటమి తృటిలో అధికారాన్ని చేజార్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.అయితే మమత బెనర్జీ మాత్రం ప్రభుత్వ వ్యతరేక ఓటును కాంగ్రెస్ కూటమి చీల్చుకుంటే తమకే లాభం చేకూరుతందన్న అంచనాలో ఉన్నారు. అందుకే మమత బెనర్జీ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను లైట్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే మమత బెనర్జీ ఇరవై శాతం టిక్కెట్లను ఖరారు చేశారు. వారందరినీ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బీజేపీ కూడా కూడా గట్టిగానే కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు పశ్చిమ బెంగాల్ లో ఏ మేరకు విజయం సాధిస్తాయి? ఎవరి ఓటమికి, ఎవరి గెలుపునకు కారణమవుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

Related Posts