నటీనటులు: మహేష్‌బాబు.. కైరా అడ్వాణీ.. ప్రకాష్‌రాజ్.. శరత్‌కుమార్.. రమాప్రభ.. దేవరాజ్.. ఆమని.. సితార.. పోసాని కృష్ణమురళి.. రవిశంకర్.. జీవా.. యశ్‌పాల్ శర్మ.. రావు రమేష్.. అజయ్.. బ్రహ్మాజీ
మ్యూజిక్: దేవిశ్రీ ప్రసాద్
ప్రొడ్యూసర్: డీవీవీ దానయ్య
డైరెక్టర్: కొరటాల శివ
అభిమానులను అలరించేందుకు మహేష్ బాబు చేసిన ప్రయోగాలు తెలుగులో మరో హీరో చేయలేదు ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్-కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు, ఆ సినిమా తర్వాత మహేష్ నుంచి అభిమానులు ఆశించిన స్థాయిలో సినిమా రాలేదు. మరి ‘భరత్ అనే నేను’ ఆ అంచనాలను అందుకుందా? మహేష్ కెరీర్‌లో మరో ‘శ్రీమంతుడు’ అయిందా? ముఖ్యమంత్రిగా మహేష్ ఏ మేరకు అలరించారు? అభిమానులకు ఇచ్చిన హామీని ‘భరత్..’ నెరవేర్చాడా?
స్టోరీ: భరత్‌రామ్(మహేష్‌బాబు) ఆంధ్రప్రదేశ్ సీఎం (శరత్ కుమార్) కుమారుడు. లండన్ కేంబ్రిడ్జ్‌లో చదువుతుంటాడు. తన తండ్రి సడన్ గా చనిపోవడంతో లండన్ నుంచి ఇంటికి వస్తాడు. పార్టీ వాళ్లు అంతా కలిసి భరత్‌ను సీఎంగా ఎన్నుకుంటారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత భుజాన వేసుకుంటాడు భరత్. ఈ క్రమంలో అతనికి ఎదురైన అవాంతరాలేంటి? తనకి ఎదురైన రాజకీయ కుట్రలను ఎలా తిప్పికొట్టాడు? వసుమతి (కైరా అడ్వాణీ)తో ప్రేమ కథ ఎలా మొదలైంది? చివరకు భరత్ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు? అనేదే స్టోరీ!
ఎలా ఉందంటే: ఇదొక పక్కా పొలిటికల్ డ్రామా. దానికి మహేష్‌బాబు ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్ హంగులు అద్దారు. పొలిటికల్ సినిమా అనగానే బోర్ కొట్టించే ప్రసంగా, సందేశాలు చూపించలేదు. రాజకీయ నేపథ్యం అంటే అంతా క్లాస్ టచ్ ఇచ్చారనుకుంటే పొరపాటే. మాస్‌తో పాటు అన్ని వర్గాలు మెచ్చేలా తీశాడు. భరత్ సీఎం అయ్యాక కథలో వేగం ఒక్కసారిగా పెరుగుతుంది. సీఎంగా అతను తీసుకునే నిర్ణయాలు షాకింగ్‌గా అనిపిస్తాయి. వసుమతితో లవ్ స్టోరీ సినిమాలో మంచి ఎంటర్టైన్ మెంట్. భరత్ తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన సీన్లు నవ్విస్తాయి. ‘భరత్ అనే నేను’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది.
సెకండ్ హాఫ్ అంతా మాస్‌కు నచ్చేలా తీశారు. ‘రాచకోత’ నేపథ్యంలో సాగిన యాక్షన్ ఎపిసోడ్స్ మహేష్ అభిమానులకు, యాక్షన్ ప్రియులకు తప్పకుండా నచ్చుతుంది. అక్కడి నుంచి స్టోరీ మరింత దూసుకెళ్తుంది. సాంగ్స్, ఫైట్స్, పాలిటిక్స్ ను చక్కగా బ్యాలెన్స్ చేశారు. ప్రెస్‌మీట్ ఎపిసోడ్ మొత్తం క్లాప్స్ కొట్టిస్తుంది. మీడియాను కూడా సినిమాలో కార్నర్ చేశారు. క్లైమాక్స్ ముందు ‘భరత్’ జోరు కాస్త తగ్గుతుంది.
ఎలా చేశారు?: ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ అత్యుత్తమ నటన ఈ సినిమాలో కనిపిస్తుంది. మహేష్ కెరీర్ లో భరత్ స్పెషల్ మూవీగా నిలుస్తుంది. ఆయన స్టైలింగ్, లుక్స్ అన్నీ అభిమానులకు బాగా నచ్చుతాయి. సంభాషణలు పలికే విధానంలో మహేష్ కొత్తగా అనిపిస్తాడు. ఇక ఎమోషనల్ సన్నివేశాలు, ఎంటర్‌టైన్‌మెంట్ పంచేటప్పుడు మరోసారి తనదైన మార్కు వేసి చెలరేగిపోయాడు. కైరా అడ్వాణీ మహేష్ పక్కన చాలా అందంగా కనిపించింది. ప్రకాష్‌రాజ్ మరోసారి తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగిలిన ఏ పాత్రనూ దర్శకుడు తక్కువ చేయలేదు. కథకు అవసరమైన మేరకు అందరి నుంచి తగిన నటనను రాబట్టుకున్నాడు.
టెక్నికల్ గా ఈ సినిమా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘భరత్ అనే నేను’, ‘వచ్చాడయ్యో సామి’ పాటలను సరైన టైమింగ్‌లో వాడుకున్నాడు దర్శకుడు. మూడు యాక్షన్ ఎపిసోడ్స్‌ను సూపర్ గా తీశారు. నిర్మాణ విలువలు కూడా అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఖరీదైన చిత్రం ఇదే కావచ్చు. కొరటాల శివ మరోసారి కథకుడిగా, దర్శకుడిగా రాణించాడు
ప్లస్ పాయింట్
+ మహేష్‌బాబు క్యారెక్టర్, యాక్షన్ చిత్రణ
+ స్టోరీ, కమర్షియల్ అంశాలు
+ ఫైట్స్
+ మ్యూజిక్
బలహీనతలు
- క్లైమాక్స్ ముందు సీన్స్..