హైద్రాబాద్, డిసెంబర్ 21,
ఏపీ మినిస్టర్ పేర్ని నానీకి.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫాలోవర్స్ కి ఎవ్వారం బానే ముదిరింది. ఉన్నది ఊరుకోక.. పేర్ని నాని.. రేవంత్ రెడ్డిని కదిలించారు. తన మానాన తాను.. తెలంగాణ కాంగ్రెస్ లో నానా కష్టాలు పడుతున్నారు. మంచి పొజిషన్ కావాలి.. పార్టీని నిలబెట్టి.. సత్తా చూపించాలి అని రేవంత్ రెడ్డి ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. ఆయన గోలలో ఆయనుంటే.. మినిస్టర్ నానీ ఏమో.. రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా.. నానా మాటలూ అన్నారు. ఓ రకంగా బాడీ షేమింగ్ కూడా చేశారు అనొచ్చు.
మినిస్టర్ ఏం అన్నారయ్యా అంటే.. పొట్టిగా ఉంటారు ఆ లీడరు.. అటూ ఇటూ తిరుగుతుంటారు.. ఆయనతో చంద్రబాబు 50 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించారు అంటూ.. చంద్రబాబు పై సెటైర్లు.. వయా రేవంత్ రెడ్డి నుంచి వేశారు. అసలేమో.. టార్గెట్ చంద్రబాబు.. అన్నదేమో రేవంత్ రెడ్డిని కావడంతో.. పొలిటికల్ సర్కిల్స్ బానే ఇష్యూ అయింది. అందరూ పేర్ని నానినే అంటున్నారు. లీడర్లు కూడా తలంటి పోస్తున్నారు. నానీకి ఇప్పుడు రేవంత్ ను కదిలించాల్సిన అవసరం ఏంటి.. ఇండైరెక్ట్ గా అలాంటి మాటలు అనాల్సిన అవసరం ఏంటి అంటున్నారు.
మరి లీడర్లే అలా అంటే.. ఇక రేవంత్ రెడ్డి హార్డు కోర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా. ఏ పార్టీలు ఉన్నారు అనేది పక్కన పెడితే.. రేవంత్ రెడ్డికి గట్టి ఫాలోయింగే ఉంది. ఇక అందరూ పేర్ని నానిని సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోల్ చేస్తున్నారు. ఖబడ్దార్ పేర్ని నానీ అంటున్నారు. నీ పని నువ్వు చూసుకోక.. మా రేవంత్ అన్న జోలికి ఎందుకు వస్తున్నవ్ అని వార్నింగ్ ఇస్తున్నారు. నీ మాటలు రేవంత్ అన్న దగ్గరికి వెళ్లకుండా ఉంటే.. దేవుడు నిన్ను కాపాడినట్లే అంటున్నారు. మచిలీ పట్నం ఎంతో దూరం లేదు.. రెండు గంటల్లో వచ్చేస్తాం.. నీ అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు. మరి ఈ మాటలపై రేవంత్ రెడ్డి టైం చూసి రెస్పాండ్ అవుతారా.. ఇప్పుడెందుకులే ఆ గోలని కదిలించడం అని కామ్ గా ఉంటారా చూడాలి