శ్రీశనైశ్చర స్వామికి నువ్వుల నూనెతో గాని, ఆముదం నూనెతో గాని తెలుపు లేదా నలుపు వత్తులను పడమర దిక్కున ఇనుప గరిటెలో దీపాన్ని వెలిగించి పెట్టి, నేరేడు పండ్లను నైవేద్యం పెట్టాలి. నైవేద్యంగా పెట్టిన నేరేడు పండ్లను బ్రాహ్మణుడికి దానం చేస్తే మనకు అనారోగ్య సమస్యలు కలుగవు. ఆ నేరేడుపండ్లను మనమే తింటే వెన్నునొప్పి, నడుంనొప్పి, మోకాళ్ళ నొప్పులు నయం అవుతాయి. పూజ చేసిన తర్వాత నేరేడు పండ్లను స్వామికి ప్రియమైన నల్ల నువ్వులతో కలిపి దానం చేస్తే శని బాధలు ఉండవు. భోజనంతో పాటు నేరేడు వడ్డిస్తే మీకు ఎప్పుడూ మృష్టాన్న భోజనం లభిస్తుంది. నేరేడు పండ్లను పుణ్యక్షేత్రాల్లో బ్రాహ్మణులకు తాంబూల సమేతంగా దానం చేస్తే భూదానం చేసినంత ఫలితం లభిస్తుంది. నేరేడు పండ్లు ఆరోగ్యానికి దోహదకారి కాబట్టి, నేరేడు పండ్లు రోజుకొకటి చొప్పొన తింటే, వైద్యుల నుంచి దూరంగా ఉండ వచ్చునని పండితులతోపాటు, శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు.
*శుభంభూయాత్*