శబరీశునికి *ఏలక్కకాయల* దండ ఎందుకు వేస్తారు? శబరిమలై లో స్వామివారికి పుష్పాభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ తాంత్రికులు ఏలకాయలదండను స్వామి మెడలో వేస్తారు. యాలుకల దండను స్వామికి సమర్పించుట వలన ఏ ఏ ఫలితాన్ని పొందవచ్చును తెలుసుకుందాం. ..
యాలుకల దండను అయ్యప్పకు సమర్పించుట వలన ఆ భక్తుల కోరికలు నెరవేరును. అనేక శుభ ఫలితములు ఇచ్చును. అమరకోశంలో యాలుకలను గూర్చి *చంద్ర స్వభావేవా పుత్రికేవా చంద్రబాల* అని చెప్పియున్నాడు. దీని అర్థం ఏమిటంటే కర్పూరమునకు కూతురువలె నుండునది అని అర్థం. "బహుని ఫలానే లాతిథి బహుళ" అని అన్నాడు. దీని అర్థం ఏమిటంటే బహు ఫలములను ఇచ్చునది. అని. యాలుకలు తాపమును పోగొట్టును అన్నాడు. తాపము అంటే? బాధ, కష్టము అని అర్ధాలు. ముఖ్యంగా తాపము మూడు విధాల వర్గీకరించి ఆ మూడింటిని" "తాపత్రయము" అన్నారు. అవి *ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక* అనే ఈ తాపత్రయాన్ని అధిగమించేసి బుద్ధిని వృద్ధి చేసి, సిద్ధిని చేకూర్చును . ఏళ్కకాయలు స్వామికి సమర్పించడం వలన అనేక విధములైన కోరికలను నెరవేర్చువచ్చునని పైన పేర్కొన్న అంశాలను బట్టి అర్థమవుతుంది.
స్వామి శరణం.