YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మరుభూమినీ వదల్లేదు

మరుభూమినీ వదల్లేదు

 కార్వాన్‌ నియోజకవర్గంలోని ఇబ్రహీంబాగ్‌ బస్తీకి చెందిన శ్మశానవాటికకు సర్వే నెంబర్‌ 178లో 18 ఎకరాల 20 గుంటల గైరాన్‌ స్థలంలో శ్మశాన వాటిక ఉంది. విలువైన ఇంత స్థలాన్ని శ్మశాన వాటికకు ఇవ్వడం కుదరదని, స్థలం మొత్తాన్ని పదేళ్ల కింద అధికారులు స్వాధీనం చేసుకుని హౌసింగ్‌ బోర్డుకు అప్పగించారు. అక్కడి నుంచి ఏపీఐఐసీకి బదిలీచేశారు. దీంతో ఈ స్థలం మొత్తాన్ని ఏపీఐఐసీకి, అనంతరం హిందీ డైరెక్టర్‌(అప్పట్లో యానిమేషన్‌ కోసం)కు లీజుకిచ్చారు. ఇదిలా ఉండగా శ్మశాన వాటిక స్థలాన్ని స్వాధీనం చేసుకొని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడమేమిటని అప్పట్లో ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. సదరు లీజ్‌ను రద్దు చేయించారు. అప్పటి నుంచి ఈ స్థలం మొత్తం ఏపీఐఐసీ(ప్రస్తుత టీఎస్‌ఐఐసీ) ఆధీనంలో ఉంది. ఈ 18ఎకరాల 20 గుంటల్లో ఎకరా స్థలాన్ని శ్మశాన వాటికకు కేటాయిస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు జీహెచ్‌ఎంసీకి బదిలీచేశారు. ఈ స్థలాన్ని గుర్తించారు.

మండల రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పటి వరకు శ్మశాన వాటిక స్థలమెంతో తేల్చకపోవడంతో ఏడాదిగా ఇబ్రహీంబాగ్‌ బస్తీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఇబ్రహీంబాగ్‌ శ్మశాన వాటికకు ఎంత స్థలం ఎక్కడ కేటాయిస్తారో స్పష్టం చేయాలని శ్మశాన వాటిక పరిరక్షణ కమిటీ అధికారులకు వినతిపత్రం అందజేసింది.

ఇబ్రహీంబాగ్‌ పరిసరప్రాంతాలను ఆర్మీకి కేటాయించారు. అప్పట్లో ఆర్మీ అధికారులు 178 సర్వే నెంబర్‌లో ఉన్న 18 ఎకరాల 20 గుంటల స్థలాన్ని ఇబ్రహీంబాగ్‌ శ్మశాన వాటికకు కేటాయించాలని ఆయా ప్రభుత్వాలకు సిఫారసు చేశారు. లాభం లేకపోయింది. దశాబ్దాలుగా ఈ శ్మశాన వాటికలోనే ఇబ్రహీంబాగ్‌కు చెందిన ప్రజలు మృతి చెందిన వారిని ఖననం చేస్తూ వచ్చారు. ఈ శ్మశానవాటికలో ఆయా కులాలకుచెందిన సమాధులు ఇప్పటికీ ఉన్నాయి. కానీ పదేళ్ల కింద స్థలాన్ని స్వాధీనం చేసుకొని కేవలం ఎక్కువ సమాధులుండే కొంత ప్రాంతాన్నే ఇబ్రహీంబాగ్‌ వాసులు వెళ్లేందుకు దారి వదిలారు. మిగతా స్థలాన్నంతా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ప్రస్తుతం ఇబ్రహీంబాగ్‌ వాసులు ఎవరైనా చనిపోతే ఖననం చేసేందుకు స్థలం లేక సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. అధికారులు పట్టించుకోక పోవడంతో బస్తీవాసులు ఎదురించలేక, పోరాడలేకపోతున్నారు. ఎవరైనా చనిపోతే బస్తీకి ఐదు కిలోమీటర్ల దూరంలో బాపూఘాట్‌ మూసీనది ఒడ్డునున్న శ్మశానవాటికలో ఖననం చేస్తున్నారు. ఇలా ఖననం చేయడానికి బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Posts