విశాఖపట్నం డిసెంబర్ 21,
వైసీపీ నగర కార్యాలయం లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధులుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస రావు హజరయ్యారు. ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.
మంత్రి అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసీపీ కుటుంబ సభ్యులకు ఈరోజు పండగ రోజు. అతి చిన్న వయస్సు లోనే రాజకీయం లోకి వచ్చిన వ్యక్తి జగన్. ప్రతి క్షేణం పేద ప్రజల అభివృద్ధి ని ఆకాక్షించే వ్యక్తి జగన్. దేశం లో ఏ ముఖ్యమంత్రి అందించలేని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. రాష్ట్రం లో అబివృద్ది కార్యక్రమాలు చేస్తుంటే చంద్రబాబు లాంటి వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని అన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మట్లాడుతూ రాష్ట్ర ప్రగతి,రాష్ట్ర వికాసం వంటి అంశాలు తో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రం లో సుమారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకొని అదే అంశాలుతో మేనిఫెస్టో లో పెట్టి ఎన్నికలకు వెళ్లారు. గ్రామ స్వరాజ్యం కోసం గ్రామ సచివాలయలు ఏర్పాటు చేశారు. మంచి నాయకుడిని ఆయన తల్లిదండ్రులు మనకి అందించారు. జగన్ 48వ జన్మదినోత్సవం సందర్బంగా విశాఖ లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసాం. విశాఖ లో రంజీ ట్రోపి కంటే మిన్నగా వై ఎస్ ఆర్ కప్ పేరుతో క్రికెట్ టోర్నీమెంట్ నిర్వహిస్తున్నామని అయన అన్నారు.