YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెంబర్తి వద్ద వి.హనుమంతరావు అరెస్ట్.

పెంబర్తి వద్ద వి.హనుమంతరావు అరెస్ట్.

జనగామ డిసెంబర్ 21
రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా ఒకరోజు సమ్మె చేసేందుకు కాకతీయ యూనివర్సిటీ కి వెళ్లి దీక్షలో పాల్గొనడానికి ప్రయత్నించిన మాజీ ఎంపీ వి.హనుమంతరావు ను పోలీసు లు జనగామ సమీపంలోని పెంబర్తి వద్ద అరెస్ట్ చేసి జనగామ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్బంగా వి.హెచ్ మాట్లాడుతూ కేసీఆర్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నాడు. మొన్న టిఆర్ఎస్ రైతులకు మద్దతుగా ధర్నా చేసింది. మొన్న కేసీఆర్ మోడీ, అమిత్ షా లను కలిసి రాగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.కేసీఆర్ వ్యవసాయ బిల్లులు,  రైతుల పట్ల తన వైఖరి ప్రదర్శించాలి.బీజేపీ కి మద్దతు ఇచ్చేది ఉంటే నేరుగా ప్రకటించాలి. ఇలా దొంగచాటు వ్యవహారాలు ఎందుకు..ఇలా మమ్మల్ని ప్రతిఘటిస్తే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని  వి. హెచ్ హెచ్చరించారు.

మాజీ ఎంపీ  వి.హనుమంత రావ్ కాకతీయ యూనివేర్సిటీకి వెళ్తుంటే జనగామ వద్ద  అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.వెంటనే ఆయనను విడుదల చేసి యూనివర్సిటీ లో జరిగే కార్యక్రమం సజావుగా జరిగేలా ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ నాయకులకు ఒక నీతి, కాంగ్రేస్ నాయకులకు ఒక నీతి నా..అని టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేసినప్పుడు అనుమతి ఇచ్చిన పోలీసులు కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నించారు.వ్యవసాయ బిల్లుల విషయంలో టిఆర్ఎస్ తన వైఖరి ప్రకటించాలి.రైతుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్నామని చెప్పి బంద్ లో పాల్గొన్న టిఆర్ఎస్ నాయకులు ఇపుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. అసెంబ్లీ లో వ్యవసాయ బిల్లులను వ్యతిరేకంగా ఎందుకు తీర్మానం చేయలేదు.టిఆర్ఎస్ నాయకుల ద్వంద్వ వైఖరి విడనాడి తమ అసలు విధానాన్ని ప్రకటించాలి.కేసీఆర్ మోడీని కలిసి వచ్చాక వ్యవసాయ, రైతు ఉద్యమాల విషయంలో విధానం మార్చుకున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ ఇతర వ్యవసాయ సంఘాలు చేస్తున్న ఉద్యమాన్ని అణచివేస్తే పోరాటం మరింత ఉదృతం చేస్తాం.. భట్టి విక్రమార్కహెచ్చరించారు.

Related Posts