YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

వందకు వందశాతం చైనాదే తప్పు

వందకు వందశాతం చైనాదే తప్పు

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 
తొలినాళ్లలో కరోనా వైరస్ వ్యాప్తిపై వాస్తవాలను దాచిపెట్టిన చైనా.. ప్రపంచ మహమ్మారిగా మారడానికి కారణమయ్యిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. అయితే, చైనా ఉద్దేశపూర్వకంగానే నిజాలను దాచిపెట్టినట్టు తాజాగా ఓ నివేదిక బయటపెట్టింది. వైరస్‌ వ్యాప్తి.. దాని పరిణామాలపై సోషల్ మీడియాలో ఎటువంటి సమాచారం పంచుకోరాదని హుకుం జారీచేసిన చైనా కమ్యూనిస్టు పార్టీ (సీసీపీ).. ఇందుకోసం కొంతమంది నిపుణులు, సంస్థలను నియమించి వారికి భారీ మొత్తాన్ని చెల్లించింది.ఈ మేరకు ఆధారాలు ప్రముఖ అంతర్జాతీయ మీడియా న్యూయార్క్‌ టైమ్స్‌, ప్రోపబ్లికా సంస్థలకు చిక్కాయి. మొత్తం 1,800 మెమోలు, 3,200కిపైగా ఉత్తర్వులను చైనా ప్రభుత్వం వెలువరించిన విషయం బయటపడింది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం.. చైనా కమ్యూనిస్ట్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న వార్తలు, కథనాలు, సమాచారాన్ని భారీ ఎత్తున నియంత్రించాలని ప్రత్యేకంగా నియమించిన యంత్రాంగాన్ని ఆదేశించింది. ఇందులో కొన్ని మీడియా సంస్థలు కూడా ఉండటం గమనార్హం.కరోనా వైరస్‌ వ్యాప్తికి సంబంధించి ఎలాంటి సమాచారం ట్రెండింగ్‌లో కారాదని, చైనీయులు హీరోగా పిలుచుకున్న డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ మరణ వార్తను సైతం దాచిపేట్టే ప్రయత్నం చేసింది. జనవరి ప్రారంభంలో కరోనా వైరస్ ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించిన డాక్టర్ లీ.. ఇది ఫ్లూ వ్యాధి లాంటి వైరస్ అని, దీనిపై ప్రపంచ ఆరోగ్య అత్యవరస పరిస్థితి తప్పదంటూ హెచ్చరించారు.దీనిపై అయనను అరెస్ట్ చేసిన పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వార్నింగ్ ఇచ్చారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ డాక్టర్ లీపై ఆభియోగాలు మోపారు. అయితే, ఇది జరిగిన నెల రోజుల తర్వాత ఆయన చెప్పిన విషయాలు నిజమేనని అధికారులు క్షమాపణలు చెప్పారు. అయితే, అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. బాధితులకు చికిత్స చేస్తూ ఆయన కరోనా బారినపడి ఫిబ్రవరి 7న కన్నుమూశారు

Related Posts