YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

జమిలి ఎన్నికలకు సిద్దం : సీఈసీ సంచలన ప్రకటన

జమిలి ఎన్నికలకు సిద్దం : సీఈసీ సంచలన ప్రకటన

న్యూ ఢిల్లీ డిసెంబర్ 21 
అందరూ ఊహించినట్టే దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మద్దతు లభించింది. జమిలి ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని గతంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం సునీల్ అరోరా ఈ ప్రతిపాదనకు తన మద్దతు తెలిపారు.జమిలి ఎన్నికల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. పార్లెమెంట్ తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని గతంలో ఎన్నికల సంఘాన్ని కోరింది.  దేశంలో నిరంతరం ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని ప్రధాని మోడీ గతంలోనే తెలిపారు. దీంతో 2022లో జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని స్పష్టమైంది. ప్రధాని మోడీ కోరిన విధంగా దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా ప్రకటించారు. జమిలీ ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాతోపాటు ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.  పార్లమెంట్ లో చట్టసవరణ జరిపి నిర్ణయం తీసుకుంటే జమిలి ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అరోరా తెలిపారు. సీఈసీ ప్రకటనతో దేశంలో జమిలి ఎన్నికలపై మరోసారి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కేంద్రం త్వరలోనే దీనిపై ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Related Posts