YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఆన్ లైన్ లోన్ యాప్స్ కు చుక్కలు చూపించిన పోలీసులు

ఆన్ లైన్ లోన్ యాప్స్ కు చుక్కలు చూపించిన పోలీసులు

హైదరాబాద్, డిసెంబర్ 22, 
ప్రజలను పట్టి పీడిస్తున్న ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ గుట్టును హైదరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. మొత్తం మూడుచోట్ల మైక్రోఫైనాన్స్‌ యాప్స్‌ కాల్‌సెంటర్స్‌ గుర్తించారు. దేశ వ్యాప్తంగా మూడుచోట్ల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, బేగంపేటలో సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఇక ఢిల్లీలోని గురుగ్రామ్‌లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. గురుగ్రామ్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ నడుస్తున్నట్టు గుర్తించారు. ఢిల్లీలో కాల్‌సెంటర్‌ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అందులో పనిచేస్తోన్న 400మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.ఇటు హైదరాబాద్‌లోని రెండు కాల్‌సెంటర్లలో పనిచేస్తోన్న 700మందిని అదుపులోకి తీసుకున్నారు. బేగంపేట, పంజాగుట్టలోని కాల్‌సెంటర్స్‌పై పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. కాల్‌సెంటర్‌లో పనిచేస్తోన్న ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తోన్నారు. ప్రజలను పట్టిపీడిస్తున్న మైక్రోఫైనాన్స్‌ యాప్స్‌ వెనుక చైనా కంపెనీలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ లోన్‌ యాప్స్‌ కీచకపర్వానికి తెర తీస్తున్నాయి. వడ్డీకి డబ్బులు ఇచ్చినట్లే ఇచ్చి.. అవి రాబట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నాయి. లోన్‌ తీసుకున్న వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నాయి. వారి బంధువులు.. తెలిసిన వారికి బెదిరింపులు తప్పవంటూ హెచ్చరిస్తున్నాయి.తీసుకున్న డబ్బులు చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ.. లోన్‌ యాప్స్‌ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారంటే.. వారి ఆగడాలు ఎంతవరకూ వెళ్లాయో వేరే చెప్పక్కర్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకున్న చిన్న మొత్తానికే భారీ స్థాయిలో వేధింపులు వస్తుండటంతో.. అవి తట్టుకోలేక లోన్‌ తీసుకున్న వారు ఉసురు తీసుకుంటున్నారు. మరో వైపు  మైక్రోఫైనాన్స్ యాప్‌  ప్రతినిధుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. డబ్బులు చెల్లించని వారిని బ్లాక్‌ మెయిల్ చేస్తున్నారు ఫైనాన్స్ ప్రతినిధులు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో.. మహిళలను పంపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత కొన్ని రోజులుగా లోన్ యాప్స్  వేధింపులు అధికమౌతున్నాయి. వీరి పెట్టే ఒత్తిడి భరించేలక..కొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లోన్‌ యాప్స్‌ నుంచి రుణాలు తీసుకుని బలవుతున్నారు. చాలామంది సామాన్యులు లోన్‌ తీసుకునేటప్పుడు ఎలాంటి నిబంధనలు ఒప్పుకుంటున్నారో కూడా తెలియనంతగా ట్రాప్‌లో చిక్కుకుంటున్నారు.బ్యాంక్‌ అకౌంట్‌లో పడిన జీతమంతా కాల్‌మనీ యాప్స్‌  దోచుకొంటుంటే ఏం చేయాలో తెలియక కన్నీరు పెట్టుకుంటున్నారు. కొంతమంది కుటుంబాల్ని సాదలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్ కాల్ మనీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మైక్రో ఫైనాన్స్ యాప్ లను రూపొందించిన యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రుణాలు ఇస్తున్న ఆన్‌లైన్ యాప్‌లు డబ్బులు కట్టడం ఆలస్యమైతే మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాయి. మైక్రో ఫైనాన్స్ ఏజెంట్ల వేధింపులు తాళలేక బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.మైక్రో ఫైనాన్స్ యాప్ లో తీసుకున్న లోన్‌కు 50 % పైన వడ్డీ చెల్లించినట్లు భాదితులు ఫిర్యాదుచేస్తున్నారు. ఆన్ లైన్ మనీ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా భావిస్తున్నారు. మనీ యాప్ లను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మనీ యాప్ లు నిషేధించాలని కేంద్ర హోం శాఖ, ఐటీ శాఖ లకు తెలంగాణ పోలీస్ శాఖ లేఖ రాసింది.

Related Posts