YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బెంగాల్ లో బీజేపీ వర్సెస్ దీదీ

బెంగాల్ లో బీజేపీ వర్సెస్ దీదీ

కోల్ కత్తా, డిసెంబర్ 22, 
శాంత్ కిషోర్.. వైసీపీని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి తీసుకుని వచ్చిన ఘనత ఈయనదే..! జగన్ కు ఉన్న ఫాలోయింగ్ కు ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు తోడవ్వడంతో టీడీపీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయింది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్  కిశోర్  పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీకి పని చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో టీఎంసీకి భారతీయ జనతా పార్టీ నుండి పెద్ద సవాల్ ఎదురవుతూ వస్తోంది. చాలా రాష్ట్రాల్లో లాగే పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీ పాగా వేయాలని అనుకుంటూ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన కూడా అదే స్థాయిలోనే సాగింది. పెద్ద ఎత్తున టీఎంసీ నాయకులు బీజేపీ బాట పట్టడంతో షాక్ అవ్వడం దీదీ వంతైంది. ఆమెకు సన్నిహితంగా ఉన్న నాయకులు కాస్తా బీజేపీలో చేరి షాక్ ఇచ్చారు. అమిత్ షా సమక్షంలో సువేందు అధికారి సహా మరో 10 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీ కండువా కప్పుకున్నారు. సువేందు వెనక మరో ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తారని భావించారు. కానీ దీపాలి బిశ్వాస్, సుక్రా ముండా, శ్యామస్థ ముఖర్జి, తాపసి మొండల్, సుదీప్ ముఖర్జీ, అశోక్ దిండా, షిభద్ర దత్త, సైకత్ పంజా, బనశ్రీ మైతీ, విశ్వజిత్ కుందు, బుర్ద్వాన్ ఎంపీ సునీల్ మొండల్  బీజేపీలో చేరారు. ఇక ఎంపీ దశరథ్ టిర్కీ కూడా బీజేపీలో చేరారు. ఈ పరిణామాలతో టీఎంసీలో కలకలం రేగింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 200 స్థానాలను కైవసం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల నాటికి తృణమూల్ కాంగ్రెస్ లో మమతా బెనర్జీ ఒక్కరే మిగులుతారని జోస్యం చెప్పారు. మమత సర్కారు రాష్ట్రంలో హింసను ఎంత ప్రేరేపిస్తే బీజేపీ అంత బలపడుతుందని.. వచ్చే ఎన్నికల్లో బెంగాల్ లో 200కి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో తమకు అధికారం ఇస్తే సోనార్ బంగ్లా (సువర్ణ బెంగాల్)ను సాకారం చేస్తామని అన్నారు. తన వ్యాఖ్యలను చూసి కొందరు నవ్వుకోవచ్చని పక్కా ప్రణాళిక ప్రకారం పని చేస్తే 200 సీట్లను దాటుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. బీజేపీకి దక్కే స్థానాలు రెండంకెల సంఖ్యను దాటవని అన్నారు. డబుల్ డిజిట్ కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొందితే తాను ట్విట్టర్ ను వదిలేస్తానని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. తాను చేసిన ఈ ట్వీట్ ను సేవ్ చేసి పెట్టుకోవాలని అన్నారు. బీజేపీకి మద్దతిస్తున్న మీడియా ఎంత ప్రచారం చేసినా.. బీజేపీకి రెండంకెల సంఖ్యకు మించి స్థానాలు రావని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇంత కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు అంటే టీఎంసీకి ఇంకా ప్రజల్లో మద్దతు ఉన్నట్లేనని తెలుస్తోంది.

Related Posts