YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రజనీ మాటలనే టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

రజనీ మాటలనే టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలు

చెన్నై, డిసెంబర్ 22, 
రజనీకాంత్ రాజకీయ పార్టీ ఖరారయింది. మరి కొద్దిరోజుల్లోనే ఆయన రాజకీయ పార్టీపై ప్రకటన చేయనున్నారు. ఆయన ప్రకటన కోసం ఇటు అభిమానులు, అటు రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. రజనీకాంత్ పార్టీ పెడుతున్నారు కాని ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు ఛాన్స్ లేదు. ఎన్నికల్లో గెలవడం, గెలవకపోవడం పక్కన పెడితే రజనీకాంత్ తాను ముఖ్యమంత్రిగా ఉండబోనని, మరొకరికి అవకాశం ఇస్తానని ఆయన ప్రకటించారు.ఇది ఆయనకు ఎన్నికల్లో ఇబ్బందిగా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. రజనీకాంత్ ఇప్పటికే సినిమాల్లో కోట్లాది రూపాయలు సంపాదించారు. లక్షల మంది అభిమానులను సంపాదించు కున్నారు. రజనీకాంత్ అవినీతికి పాల్పడే, ప్రోత్సహించే అవకాశం లేదు. అయితే రజనీకాంత్ స్థానంలో మరొక వ్యక్తి ముఖ్యమంత్రిగా వస్తే తలైవా చెబుతున్న ఆశయాలు సాధ్యం కావడం కష్టమేనన్న టాక్ పార్టీలోనూ బలంగా విన్పిస్తుంది.అందుకే అభిమానుల వత్తిడి మేరకు పార్టీ ని ప్రకటిస్తున్న రజనీకాంత్ అదే సమావేశంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపడతానని కూడా చెప్పాలని అభిమానులు కోరుతున్నారు. అప్పుడే పార్టీకి జోష్ వస్తుందంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రజనీకాంత్ కు సన్నిహితులు కొందరు చెప్పినట్లు తెలిసింది. అయితే రజనీకాంత్ తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని, మాట మార్చలేనని చెప్పినట్లు సమాచారం.మరి రజనీకాంత్ తాను సీఎం అభ్యర్థిగా ఉంటానని ప్రకటించకపోతే ప్రజలు మద్దతు తెలపరన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనిని విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. రజనీకాంత్ బీజేపీ కోసమే పార్టీ పెట్టారని, హిందీ పార్టీని ఉద్ధరించడానికే ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టనని చెప్పారని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో రజనీకాంత్ ను ఆ మాటను ఉప సంహరించుకోవాలని వత్తిడి పెరుగుతుంది. మరి రజనీకాంత్ అన్న మాటను వెనక్కు తీసుకుంటారా? లేదా మాటపై నిలబడతారా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts