YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ప్రియుడు కోసం... బాత్రూం వీడియోలు

ప్రియుడు కోసం... బాత్రూం వీడియోలు

బెంగళూర్, డిసెంబర్ 22, 
బెంగళూరులో నర్సుగా పనిచేస్తున్న 25 ఏళ్ల యువతి తప్పు దారి పట్టింది. తన ప్రియుడిని సంతృప్తి చేయడానికి దారుణానికి ఒడిగట్టింది. హాస్పిటల్ హాస్టల్ బాత్రూమ్‌లో లో సీక్రెట్‌గా మొబైల్ ఫోన్లు పెట్టి తన సహోద్యోగుల నగ్న వీడియోలను తీసి ప్రియుడికి పంపించింది. ప్రియుడితో బంధం నిలబెట్టుకోవడానికి ఈ నీచానికి దిగింది. ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కి జైలు పాలైంది. ఆమె ఎంత మంది నర్సుల నగ్న వీడియోలు పంపించింది? నిందితుడు వాటిని ఏం చేశాడు అనే విషయాలను తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.అశ్విని (25) అనే మహిళ బెంగళూరులో ఓ పేరుపొందిన ఆస్పత్రిలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్‌లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. కొంత కాలం కిందట ఓ రాంగ్ కాల్ ద్వారా తమిళనాడులోని వెల్లూర్‌కు చెందిన ప్రభు (24) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లో మాట్లాడుకున్న వారి మధ్య అనతి కాలంలోనే ప్రేమ చిగురించింది. కానీ, ఆ నర్సుకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. అందులో ఏ ఒక్కటీ వర్కవుట్ కాలేదు.ఇద్దరు భర్తలను వదిలేసి హాస్పిటల్‌లోని హాస్టల్‌లో ఉంటోంది ఆ నర్సు. ఈ విషయం తెలిసిన తర్వాత తమిళనాడు యువకుడు ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ నర్సు అతడిని సంతృప్తి చేయడానికి తన నగ్న వీడియోలు చిత్రీకరించి పంపించడం మొదలు పెట్టింది. ఆ వీడియోల ద్వారా ప్రియుడు ఆనందం పొందాడు. అయితే.. అనతి కాలంలోనే అతడికి అవి బోర్ కొట్టాయి.ఆమె వీడియోలు తనకు బోర్ కొట్టాయని ప్రభు తన గర్ల్‌ఫ్రెండ్‌కు చెప్పాడు. దీంతో ఎక్కడ తన ప్రియుడు దూరమవుతాడోనని మరో దురాలోచన చేసింది ఆ నర్సు. హాస్టల్‌లో తనతో పాటు ఉంటున్న నర్సుల వీడియోలను రహస్యంగా చిత్రీకరించి పంపిస్తానని ప్రియుడికి చెప్పింది.బాత్రూమ్ కిటికీలో రహస్యంగా ఫోన్ పెట్టి సహోద్యోగులు స్నానం చేస్తున్న వీడియోలను చిత్రీకరించింది. వాటిని తన ప్రియుడికి పంపించింది. ఓ రోజు ఓ నర్సు బాత్‌రూంలో స్నానం చేస్తుండగా కిటికీలో ఫ్లాష్ వెలిగినట్లు అనిపించి పరిశీలించింది. ఈ ఫోన్‌లో వీడియోలు చూసి షాక్ గురైంది. ఆ హాస్టల్ ఉన్న నర్సులందరి నగ్న వీడియోలు అందులో ఉన్నట్లు గుర్తించింది.బాధితురాలు వెంటనే వెళ్లి దీనిపై అశ్వినిని నిలదీసింది. అశ్విని సమాధానం చెప్పలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను అదే హాస్పిటల్‌లో చేర్చించి చికిత్స అందించారు. కోలుకున్న తర్వాత పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.వెల్లూర్‌కు చెందిన ప్రభు స్థానికంగా ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తన ప్రేయసి బెంగళూరు నర్సును కొన్ని పర్యాయాలు మాత్రమే కలిసినట్లు గుర్తించారు. అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నర్సు పంపించిన వీడియోలను అతడు ఏం చేశాడు? ఆన్‌లైన్‌లో అమ్మేశాడా? ఇంకెవరితోనైనా షేర్ చేసుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులో తేలనున్నాయి.

Related Posts