YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆదాయ పన్ను శాఖ కొత్త ఆఫర్

ఆదాయ పన్ను శాఖ కొత్త ఆఫర్

హైదరాబాద్ డిసెంబర్ 22 
వివాద్ సే విస్వాస్ పేరుతో ఆఫర్  ను ఆదాయ పన్ను శాఖ ప్రకటించింది. వివాదాలు ఉన్న ఇన్ కమ్ టాక్స్ ను క్లియర్ చేసుకునేందుకు మంచి అవకాశం అని  ఛీఫ్ కమర్షియల్ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్  జే బీ మహాపత్ర అన్నారు.  మంగళవారం అయనమీడియాతో మాట్లాడారు. ఈ స్కీం ప్రజలకు తెలియజేసేందుకు వివాద్ సే విశ్వాస్ ప్రచార వాహానాలను అయన ప్రారంబించారు. పన్ను చెల్లింపు దారుడికి  ఐటీ శాఖ కు మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించడానికి ఈ వివాద్ సే విస్వాస్ స్కీం ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. 31 జనవరి 2020నుంచి వివాదాలు ఉన్న ఉన్న ఐటీ రిటన్స్ ను  పన్నుదారులు ఈ నెల 31 వరకు ఆప్లికేషన్ పెట్టుకుంటె 31మార్చ్ 2021 లోపు పరిష్కారం అవుతాయి. ఇలా చేయడం వల్ల జరిమానా మాఫీ అవుతుంది..దీంతో పాటు పన్ను చెల్లించని వారిపై కోర్ట్ లు ఉన్న కేసులు విత్ డ్రా అవుతాయి. ఈ స్కీం ద్వారా వివాదాలు ఉన్న టాక్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. అన్ని రకాల టాక్స్ క్లియర్ చేసుకోవడానికి మంచి అవకాశం.  31డిసెంబర్ లోపు ఐటీ డిక్లరేషన్ ఇచ్చినవారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆన్ లైన్ అప్లికేషన్ ద్వారా ఐటీ డిక్లరేషన్ ఇవ్వోచ్చు. మన తెలుగు రాష్ట్రాల లలో 8వేల కోట్ల ఇన్ కమ్ టాక్స్  బకాయిలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 4 లక్షల 82వేల ఐటీ రిటన్స్ కేసులు కోర్ట్ లో ఉన్నాయని అంచనా వేస్తున్నామని అయన అన్నారు.

Related Posts