నాడు ప్రజలపై ఏదో ప్రేమ ఉన్నట్టు ముద్దులు పెట్టి... నేడు అధిక ధరలతో రాష్ట్ర ప్రజల నడ్డి విరిగేలా గుడి బండలు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పసుపు - కుంకుమ, జాకెట్ పంపిణీ కార్యక్రమం మంగళవారం నగరంలోని 10, 11, 09, 39, 42 వార్డుల్లో జరిగింది. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు), డిప్యూటీ మాజీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, హితకారిణి సమాజం ఛైర్మన్ యాళ్ల ప్రదీప్, మాజీ కార్పొరేటర్లు గగ్గర సూర్యనారాయణ, కోసూరి చండీప్రియ, గొర్రెల రమణి, తంగెళ్ళ బాబి, వాసిరెడ్డి బాబి, కంటిపూడి రాజేంద్రప్రసాద్, మళ్ల వెంకటరాజు, తదితర టీడీపీ నాయకులు గృహ లబ్ధిదారులకు పసుపు - కుంకుమ, జాకెట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వల్ల ఇప్పటికే ఆర్ధికంగా నలిగిపోయిన రాష్ట్ర ప్రజలపై ప్రభుత్వం గుదిబండలు వేస్తోన్నారు. అన్ని సౌకర్యాలతో ఆధునాతనంగా నిర్మించిన టిడ్కో ఇళ్లను లభిదారులకు పంపిణీ చేయకుండా 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేసిందని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ చేసిన పోరాట ఫలితంగా ఈ నెల 25వ తేదీన టిడ్కో ఇళ్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభత్వం సిద్ధమైందన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ జగన్ ఏ పథకం చేపట్టినా అర్హులకు అందకుండా మెలికలు పెడుతోందన్నారు. ఒక చేత్తో కొద్దిగా ఇచ్చి మరో చేత్తో అధికంగా వసూలు చేస్తోందన్నారు. అధికంగా పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఏం తినలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 25వ తేదీన టిడ్కో ఇళ్లు పంపిణీ చేయకపోయినా, లేదా అర్హులకు అన్యాయం చేసినా తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. డిప్యూటీ మాజీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో అర్హలందరికీ న్యాయం చేకూరిందన్నారు. హితకారిణి సమాజం ఛైర్మన్ యాళ్ల ప్రదీప్ మాట్లాడుతూ ప్రస్తుత ఈ అడ్డగోలు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలంతా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలల పాటు ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయకపోవడం వల్ల అధికంగా వడ్డీలు చెల్లించడంతో పాటు అద్దె కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకానికీ ఏదో ఒక మెలిక పెట్టి దాని ప్రతిఫలం అర్హులకు అందకుండా చేస్తోందని విమర్శించారు. 10వ వార్డులో పంచకట్ల శివప్రసాద్, చొప్పెర్ల భద్రరావు, చంటి, ఖాన్, అప్పన్న, వాసంశెట్టి బుజ్జి, లింగం వెంకటేశ్వరరావు, బుడ్డిగ శ్యామ్, రాయి లక్ష్మణరావు, చిత్రపు చిన్ని, 11వ వార్డులో అడబాల రాజా, జె గోవిందరాజులు, గరికిన రామారావు, టి ఆంజనేయులు, కారుణ్య రామకృష్ణ, తోట కిరణ్, సాయి, నడిమింటి సత్యవేణి, అడపా మణి, సత్య, విజయ, 9వ వార్డులో శివకుమార్, బాబు, తమ్మిరాజు, వీర్రన్న, నవీన్, దొడ్డి దేవుడమ్మ, నెల్లి సరస్వతి, కన్నమ్మ, పరమేశ్వరి, కక్కల అప్పారావు, జ్యోతి శేఖర్, 39వ వార్డులో తులసీ రామ్, యాళ్ల రవికుమార్, తుల్లి పద్మ, అంగులూరి నాయుడు, మజ్జి రామకృష్ణ, రాజ్, నాగమణి, కొప్పి లక్ష్మి, 42వ డివిజన్లో ఎంఎ రషీద్, కెవీ శ్రీనివాస్, ఎస్ అర్జున్, డి బాల, వానపల్లి శ్రీనివాస్, మొండి సత్యనారాయణ, జల్లి హేమలత, శ్రావణి, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.