టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు హోదాలో పార్థసారథి ఇతర మత ప్రచారానికి వెళ్లాలంటే, రాజీనామా చేసి వెళ్లాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.క్రిస్మస్ వేడుకలలో పాల్గొంటే తిరుమలకు వెళ్లనీకుండ అడ్డుకుంటామని స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొంతమంది టిటిడి పాలక మండలి సభ్యులు ప్రవర్తిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు పార్థసారథిని సెమి క్రిస్మస్ కు ఆహ్వానిస్తూ విజయవాడలో కరపత్రాలు వెలిశాయని, అయితే క్రిస్మస్ వేడుకలకు హాజరైతే వెంటనే పాలకమండలి సభ్యుడి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. టిటిడి పాలక మండలి సభ్యులు, ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలకు హాజరుకాకూడదని రెజల్యూషన్ తీసుకురావాలి పేర్కొన్నారు. పార్థసారథి క్రిస్మస్ వేడుకలకు హాజరై తిరుపతికి వస్తే తిరుమలకు వెళ్ళనీయకుండా అడ్డుకుంటాం హెచ్చరించారు. టిటిడి పాలకమండలి సభ్యులు హిందుత్వానికి ప్రతినిధులని..ఇతర మతాలకు కాదని స్పష్టంచేశారు.టిటిడి ఉద్యోగులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉందని అలాంటి వారిపై టిటిడి విజిలెన్స్, నిఘా సిబ్బంది దృష్టి పెట్టాలని కోరారు. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు హిందూ మతానికి ప్రతినిధులన్న విషయాన్ని టిటిడి గుర్తించుకోవాలి అన్నారు.ఈ విలేకర్ల సమావేశంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు