YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

టాటా షేర్లకు భారీగా లాభం

టాటా షేర్లకు భారీగా లాభం

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) షేర్లు ఏకంగా ఐదు శాతం మేర పెరిగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను టీసీఎస్ లాభాలు అంచనాలు మించడంతో ఆ సంస్థ షేర్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టీసీఎస్ షేర్ ధర రూ.3354.75గా ఉంది. షేర్ ధర 5 శాతం పెరగడంతో సంస్థ మార్కెట్ విలువ రూ.30 వేలు కోట్లు పెరగడం విశేషం. మార్చితో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ లాభం రూ.6904 కోట్లుగా ఉంది. ఆపరేషన్స్ ద్వారా రూ.32075 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇది గతేడాది కంటే 8.2 శాతం ఎక్కువ.దేశంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) 2017-18 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధితో రూ.6,904 కోట్ల నికర లాభాలు సాధించింది. అదే విధంగా 1:1 బోనస్‌ షేర్‌ను అందించడానికి ఆ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. 2016-17 ఇదే క్యూ4లో రూ.6,608 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. టాటా గ్రూపునకు చెందిన ఈ కంపెనీ గత క్యూ4తో 8.2 శాతం వృద్ధితో రూ.32,075 కోట్ల రెవెన్యూ సాధించింది.అన్ని పరిశ్రమల నుంచి లభించిన పటిష్టమైన డిజిటల్‌ డిమాండ్‌ తమ ఫలితాలకు మద్ధతునిచ్చిందని టిసిఎస్‌ సిఇఒ రాజేష్‌ గోపినాథ్‌ తెలిపారు. తమ మొత్తం రెవెన్యూలో డిజిటల్‌ వాటా 23.8 శాతం నుంచి 42.8 శాతానికి చేరిందన్నారు. 2017-18లో టిసిఎస్‌ మొత్తం నికర లాభాలు మాత్రం 1.7 శాతం తగ్గి రూ.25,826 కోట్లుగా నమోదయ్యాయి. ఇదే సమయంలో రెవెన్యూ 4.3 శాతం పెరిగి రూ.1.23 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. డాలర్ల రూపంలో రెవెన్యూలో రెండంకెల వృద్ధి సాధించామని గోపినాథన్‌ తెలిపారు. మార్చి 2018 ముగింపు నాటికి టిసిఎస్‌ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,94,998కి చేరింది. గతేడాదిలో మొత్తంగా 100 మిలియన్‌ డాలర్లపైగా విలువ చేసే కేటగిరీలో కొత్తగా ముగ్గురు ఖాతాదారులను సంపాదించింది. 50 మిలియన్‌ డాలర్ల పైబడిన వాటిలో 13 మందిని, 20 మిలియన్ల పైబడిన వాటిలో 17 మందిని, 10 మిలియన్ల పైబడిన వాటిలో 40 మంది చొప్పున ఖాతాదారులను సాధించింది. గురువారం బిఎస్ఈ లో టిసిఎస్‌ షేర్‌ 0.99 శాతం పెరిగి రూ.3,190.65 వద్ద ముగిసింది. ప్ర‌స్తుతం టీసీఎస్ షేర్ ధ‌ర రూ.202.20 లాభంతో రూ.3393.45 వ‌ద్ద కొన‌సాగుతోంది

Related Posts