ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సినీయర్ ఐయేఎస్ అధికారి అధిత్యానాధ్ దాస్ నియమితులయ్యారు. అయన 1987 బ్యాచ్కు చెందిన ఏపీ క్యాడర్అధికారి. బీహార్కు చెందిన ఆదిత్యనాథ్ దాస్ 1961లో జన్మించారు. 1988లో ఏపీ ప్రభుత్వంలో ఆయన కెరీర్ ప్రారంభించారు. 1988లో విజయనగర జిల్లా అసిస్టెంట్ కలెక్టర్గా కెరీర్ మొదలుపెట్టిన ఆదిత్యనాథ్ దాస్, నంద్యాల, విజయవాడలో సహాయ కలెక్టర్గా పనిచేసి, 1996 నాటికి కృష్ణా జిల్లా జేసీగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో వరంగల్ కలెక్టర్గా ఆదిత్యనాథ్నుప్రభుత్వం నియమించింది. 2001లో ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు కమిషనర్గా బాధ్యతలు వహించారు. 2006 వరకూ ఢిల్లీలో పనిచేసి తిరిగి ఏపీలో పురపాలకశాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 2007లో యూపీ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆదిత్యనాథ్ దాస్.. అనంతరం తిరిగొచ్చాక ఐ అండ్ క్యాడ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2015లో వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు అయిన ప్రభుత్వంలో నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసారు. అదే ఏడాది పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా 2018 నాటికి ఉన్నత విద్యాశాఖకు కూడా ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.2018లో పాఠశాల విద్యాశాఖలోనే అదనపు ముఖ్యకార్యదర్శి స్దాయికి ప్రమోషన్ పోందారు. చంద్రబాబు ప్రభుత్వంలో హయాంలో కీలక బాధ్యతలు నిర్వర్తించాక..అనంతరం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాగానే జలవనరులశాఖలో బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖలకూ ఆయన్ను అదనపు ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం అదే హోదాలో ఉండగా నీలం సాహ్నీ పదవీ విరమణ నేపథ్యంలో త్వరలోనే సియస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.