YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వరుస దెబ్బలతో గులాబీ డీలా

వరుస దెబ్బలతో గులాబీ డీలా

హైదరాబాద్, డిసెంబర్ 23, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ప్రయాణం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. ఎన్నో కఠిన పరిస్థితులను దాటుకుని కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి దాకా ఎదిగారు. తెలంగాణను బంగారు తెలంగాణలా మారుస్తానని చెప్పి ప్రజల మద్దతుతో గద్దెను ఎక్కారు కేసీఆర్. ఇన్నాళ్లూ తెలంగాణలో తిరుగు లేని పార్టీ తమదని చెప్పుకున్న టీఆర్ఎస్ కు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్ద సవాల్ నే విసురుతోంది. ఇక ఏ మాత్రం వెనుకడుగు వేసినా రాబోయే ఎన్నికల్లో అధికార పీఠం టీఆర్ఎస్ కు దూరమవ్వడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు.
తాజాగా కేసీఆర్ కు సలహాలు ఇస్తున్న వాళ్ళ గురించి తెలంగాణ వ్యాప్తంగా తెగ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో కేసీఆర్ అమలు చేసినవి ఫెయిల్యూర్ గా నిలిచాయి. కేసీఆర్ ఇమేజ్ కు కూడా బాగా డ్యామేజీ జరిగింది. రిజిస్ట్రేషన్లు నిలిపివేత, ధరణి విధానం, ఎల్‌ఆర్ఎస్‌ లు కేసీఆర్ కు ఆయన ప్రభుత్వానికి పెద్ద మైనస్ గా నిలిచాయి. కేసీఆర్ ప్రజలను దోచుకోవడానికే ఇవి తెచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నాయి ప్రతి పక్షాలు.టీఆర్ఎస్‌లో ఈ నిర్ణయాలకు కారణం ఎవరన్న చర్చ జరుగుతోంది. కొంత మంది సీనియర్ అధికారులు ఈ పరిపాలనా నిర్ణయాలు కేసీఆర్ కు ఇస్తున్నారనే అంటున్నారు. కొందరు అధికారుల కారణంగా నాయకులు కొన్ని విషయాలను ఆహా.. ఓహో అంటూ అమలుకు ముందుకు వెళతారు.. కానీ కొన్ని బెడిసికొడుతూ ఉంటాయి. తాజాగా కేసీఆర్ విషయంలో అదే చోటు చేసుకుంది.  
తెలంగాణలో కొంత మంది అధికారులు కేసీఆర్‌ కోటరీగా ఏర్పడి ఆయనకు సలహాలిస్తున్నారని ఆ ప్రకారమే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ధరణి అమల్లోకి తేవడం.. తక్షణం రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం… అదే సమయంలో ఎల్ఆర్ఎస్ తీసుకుని వస్తే భూసమస్యలు పరిష్కారమై ప్రజలకు మేలు కలుగుతుందని భావించినా.. అది ప్రజలకు ఏ మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లు గత మూడు నెలల నుంచి లేకపోవడంతో అమ్మకాలు, కొనుగోళ్లు ఆగిపోయాయి. కొత్త విధానం మరిన్ని సమస్యలు తెచ్చింది. న్యాయవివాదాల్లో చిక్కుకుపోవడంతో పాత విధానంతోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఎల్ఆర్ఎస్ సమస్య ఉండడంతో ఇదే పాయింట్ మీద విపక్షాలు టీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో కేసీఆర్ పాలనా పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా వరకూ బెడిసికొడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ఏ అధికారులనైతే నమ్మారో.. ఆ అధికారుల నిర్ణయాల కారణంగానే తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.

Related Posts