హైద్రాబద్, డిసెంబర్ 23
ఎన్టీఆర్, కొడాలి నాని.. వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ గురించి తెలీని పొలిటికల్ లీడర్ ఉండడు. వీళ్ల స్నేహం గురించి తెలీని పొలిటికల్ ఫాలోవర్ ఉండడు. అరుగుల మీద కూర్చోని ప్రపంచ పాలిటిక్స్ ని మార్చేసే.. ఊళ్లల్లో ఉండే పొలిటీషియన్స్ కి కూడా కొడాలి నానీకి.. ఎన్టీఆర్ కి ఉన్న దోస్తానా గురించి తెలిసిందే. కానీ.. వీళ్లిద్దరికీ బాగా గ్యాప్ వచ్చిందంట. కలిసి చానాళ్లవుతోందంట. మాట్లాడుకుని ఇంకా ఎక్కువ రోజులు అవుతుందంట. యట్ లీస్ట్.. వాట్సాపుల్లో స్టాటస్ లు కూడా చూసుకోనంత గ్యాప్ అట. అసలు ఒకరి నంబర్లు ఒకరు బ్లాక్ కూడా చేసుకున్నారు కావచ్చు అనే టాక్ వస్తోంది.అసలేం జరిగింది. ఏం జరగబోతుంది. మాకు తెలియాలి అంటే.. చాలానే ఉన్నయ్. నానీ అన్న అంటూ.. ప్రేమతో పిలుస్తాడు ఎన్టీఆర్. కానీ.. ఇప్పుడు ఆ సిచ్చువేషన్ లేదట. కట్ అయి కూడా చానాళ్లు అవుతోందంట కూడా. నాని వల్ల ఎన్టీఆర్ హర్ట్ కావడంతోనే.. వీరిద్దరి మధ్యా స్నేహం తగ్గిపోయిందని. దూరం దూరం అంటూ అనుకుంటూ.. చాలా దూరం వెళ్లిపోయారని.. ఒకరికొకరు గుర్తు రానంతగా గ్యాప్ రావడానికి ఎన్టీఆర్ హర్టు కావడమే రీజననీ అంటున్నారు. ఈయన వల్ల నాకేంటి ఈ ప్రాబ్లమ్ అనుకున్న ఎన్టీఆర్ దూరమయ్యారట. నాని ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా.. దాని వెనక ఎన్టీఆర్ ఉన్నాడు.. ఎన్టీఆరే నానితో ఈ రకమైన డైలాగ్ కొట్టించాడు అని జనం అనుకోవడం.. నాని కూడా జనం అలా అనుకునేలా మాట్లాడ్డంతో ఈ ప్రాబ్లమ్ వచ్చిందంట. నా మానాన నేనేదో తీసిన షాట్ నే తీసుకుంటూ.. చేసిన ఎక్స్ ప్రెషన్నే చేసుకుంటూ.. హీరోయిన్లతో రొమాన్సులు చేస్తూ టైం గడిపేస్తుంటే.. ప్రతి పొలిటికల్ హీట్ లోకి నన్ను తీసుకెళ్లి పడేస్తుంటే నా గ్లామర్ పోతుంది అని ఫీలై పోయాడట ఎన్టీఆర్. నీతో నా చావుకొచ్చింది అని ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా అంటుండడంతో.. సరె సరెలే.. ఎన్నెన్నో అనుకుంటాం..అన్నీ అవుతాయా ఏంటీ అని.. ఇద్దరూ డిస్టెన్స్ మేన్ టేన్ చేస్తున్నారట. నాని అంటే.. ఆవేశం స్టార్ అని తెలిసిందే కదా. కొన్ని కొన్ని డైలాగులు ఎన్టీఆర్ కి నచ్చకపోవడం కూడా ఓ రీజన్ అని వినిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడే ఎన్టీఆర్ తో గ్యాప్ వచ్చిందనీ.. గ్యాప్ వచ్చిన తర్వాతనే.. టీడీపీలో లైఫ్ ఉండదేమో అని.. నాని వైసీపీలోకి వచ్చాడు అనే వాళ్లూ ఉన్నారు.