గత కొద్ది రోజులుగా ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్- కత్తి మహేశ్ మధ్య తీవ్రస్థాయిలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదానికి కాస్త తెరపడింది. అయితే అప్పట్నుంచి విశ్వేషకులు, రాజకీయ నాయకుల నుంచి పవన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవన్ లాబీయింగ్ వ్యవహారంపై సీనియర్ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ స్పందించారు. ఓ చానెల్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. పవన్ ఇప్పటివరకూ పొలిటికల్ లాబీయింగ్‌లో ఉన్నారని, ఏదైనా సమస్యను గుర్తించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి, ఆయన ద్వారా పరిష్కారం చేయిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
అయితే అంతటితో ఆగని నాగేశ్వర్.. పవన్ కల్యాణ్ అభిమానులు ఈ ఆవేశం ఆపుకుంటే ‘జనసేన’ బాగుపడుతుందంటూ సూచించారు. "పవన్ కల్యాణ్ పై దోమ వాలినా దానిపై అణుబాంబు వేసి చంపుతాను. ‘ఈగ వాలితే దానిపై రివాల్వర్ పేలుస్తాను. అనే లక్షణం వల్ల పవన్‌కే నష్టం తప్ప నాకేమీ నష్టం లేదు. నా కొంప మునిగేదేమీ లేదు. ఈ ధోరణి మంచిది కాదు. ‘లాబీయింగ్’ అనేది చెడ్డ పదమేమీ కాదు. అమెరికాలో అయితే లాబీయిస్టులు అనే ప్రత్యేక ప్రొఫెషన్ ఒకటి ఉంటుంది" అని నాగేశ్వర్ అన్నారు.
అయితే నాగేశ్వర్ వ్యాఖ్యలపై మాత్రం పవన్ అభిమానులు కాస్త గుర్రుమంటున్నారు. ఆయన అన్న వ్యాఖ్యలను కాస్త ఆచి తూచి ఆలోచిస్తే మాత్రం అందులో ఏ మాత్రం తప్పులేదని స్పష్టంగా అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే నాగేశ్వర్ ఓ సూచన చేశారన్న విషయం పవన్ అభిమానులు తెలుసుకోవాలన్న మాట.