వికారాబాద్ డిసెంబర్ 23
ఆ బ్యాంకు లో రోజూ కోట్ల రూపాయలు ట్రాన్సక్షన్ జరుగుతుంది. కానీ అక్కడ మాత్రం చూపులకు మాత్రమే సిసి కెమెరాలు ఉన్నాయి. అక్కడ నగదు డ్రా చేసుకున్నా, ఇంటికి వచ్చినంత వరకు గ్యారెంటీ వుండదు. వివరాలు ఇలా వున్నాయి.
వికారాబాద్ జిల్లా తాండూర్ ఎస్బీఐ (ఏడీబీ) బ్యాంకులో లో రైతు వెంకట్ రెడ్డి కి అయన ఖాతాలో పత్తి పైసలు జామా అయ్యాయి. బషీరాబాద్ మండలం నుంచి పర్వత్ పల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి స్లిప్ రాసుకొని క్యాష్ కౌంటర్ దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నాడు. అక్కడే కుర్చీలో కూర్చున్న వెంకట్ రెడ్డి కు కొందరు మాయమాటలు చెప్పి పైసలు లెక్క పెట్టి ఇస్తా అని రూ 40000 తో ఉడాయించారు. నగదు పోయిందని వెంకట్ రెడ్డి బ్యాంకు మేనేజర్ కు ఫిర్యాదు చేసాడు. మా బాధ్యత తీరిపోయింది మాకు సంబంధం లేదని బ్యాంకు అధికారులు చెప్పడంతో వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసాడు