YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇంపార్ట్ మెంట్ రోల్ లో వంగవీటి

ఇంపార్ట్ మెంట్ రోల్ లో వంగవీటి

విజయవాడ, డిసెంబర్ 24, 
వంగ‌వీటి అనే మాటే ఒక బ్రాండ్ క‌దా. విజ‌యవాడ పాలిటిక్స్ లో కూడా వంగ‌వీటికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఉంది. వంగ‌వీటి రాధా ఇప్పుడు అక్క‌డ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యారు. టీడీపీలో కీ లీడ‌ర్ గా మారిపోయారట వంగ‌వీటి రాధా. చూస్తుంటే.. ఆయ‌న స్థానం ఇంకా పెరిగి.. టీడీపీలో చక్రం తిప్పే లీడ‌ర్ గా మారిపోతార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో వినిపిస్తోన్న మాట‌.
అమ‌రావ‌తి ఉద్య‌మంలో ఇప్పుడు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు వంగ‌వీటి రాధా. ప‌ద‌వి లేక‌పోయినా.. ప‌వ‌ర్ ఫుల్ గా న‌డుస్తున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న‌దే పై చేయిగా న‌డిచే ఛాన్స్ ఉంది. ఇక రాజ‌ధాని విషయానికి వ‌స్తే.. ఒక వ‌ర్గం చేసే ఉద్య‌మంగా మారిపోయింద‌ని. అందుకే.. వంగ‌వీటి రాధా ఇంపార్టెన్స్ పెరిగితే.. టీడీపీ మెయిన్ లీడ్ గా చేస్తున్న అమ‌రావ‌తి ఉద్య‌మానికి కొత్త రూపం వ‌స్తుంద‌ని. లేని పోని కామెంట్స్ కి చెక్ పడి.. ఉద్య‌మం రైతు ఉద్య‌మంగా ముందుకెళ్తుంద‌నే థాట్స్ కూడా ఉన్నాయ‌ట. రైతుల ఉద్య‌మాన్ని బ‌ల‌ప‌రిచేందుకు.. వంగ‌వీటి రాధా పాత్ర కూడా చాలా ఎక్కువేన‌ట‌. ఇక పోతే.. వంగ‌వీటి రాధా ఇప్పుడు నారా లోకేశ్ కి చాలా క్లోజ్ అయ్యార‌ట‌. చాలామంది సీనియ‌ర్లు ఉన్నా.. లోకేశ్ తో వంగ‌వీటి రాధా ఫ్రెండ్షిప్ పెరిగిందంట‌. ఆయ‌న కూడా రాధాని ప‌వ‌ర్ ఉన్న లీడర్ గా గుర్తించ‌డం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా రాధాకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వ‌డంతో పార్టీలో రాధా పాత్ర పెరుగుతోందంట‌.
రాజ‌కీయంలో శాశ్వ‌త శ‌తృత్వం ఉండ‌దంటారు క‌దా.. అలాగే ముందుకెళ్తున్నారు లీడ‌ర్లు. ఎంతోమంది టీడీపీలోకి రావ‌ద్దు అన్నా.. రాధా వ‌చ్చారు. అలాగే.. కొడాలి నానితో రాధాకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వైసీపీలో మ‌ళ్లీ చేర్చాల‌ని నాని చాలా ప్ర‌య‌త్నాలు చేశారు ఆ మ‌ధ్య‌. అయినా స‌రే.. రాధా మాత్రం.. టీడీపీలోనే ఉంటాన‌ని చెప్ప‌డం.. ఆ విష‌యం చంద్ర‌బాబు దాకా రావ‌డంతో.. రాధాకి ప్రాధాన్యత ఇంకాస్త పెరిగిన‌ట్లుగా టాక్. సో.. రాధా ప‌వ‌ర్.. పాలిటిక్స్ చేసే స్టైల్.. లోకేశ్ తో ఉన్న ఫ్రెండ్షిప్.. న‌మ్మ‌క‌మైన లీడ‌ర్ గా ఉండ‌డంతో.. ముందు ముందు టీడీపీలో రాధా పాత్ర ఎక్కువే ఉంటుంది అంటున్నారు.

Related Posts