YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ... ఎన్నికలు నిర్వహిస్తారా...

నిమ్మగడ్డ... ఎన్నికలు నిర్వహిస్తారా...

విజయవాడ, డిసెంబర్ 24, 
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నది ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముఖ్య ఉద్దేశ్యం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల నిర్వహణకు ఒప్పుకోవడం లేదు. ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించాలని నిమ్మగడ్డ కోర్టుల దాకా వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా మహమ్మారి కుదిపేస్తోందంటూ ఓ వైపు.. కరోనా వ్యాక్సిన్ వేయాల్సిన అవసరం ఉందని మరో వైపు ఎన్నో కారణాలను చూపిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్ఈసీ తరఫున ప్రముఖ న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. అశ్వనీకుమార్ వాదనలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించింది. ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ అధికారులను వెంటనే ఎస్‌ఈసీ దగ్గరకు పంపించాలని ధర్మాసనం సూచించింది. రాష్ట్రంలో కరోనా  పరిస్థితిపై ఎస్ఈసీకి తాజా పరిస్థితులను వివరించాలని.. సీనియర్ అధికారులతో సంప్రదింపుల తర్వాత ఎన్నికలపై ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేస్తారని ధర్మాసనం సూచించింది. అధికారుల బృందం ఎస్‌ఈసీతో చర్చించిన అంశాలను తెలపాలన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. దీనిపై 29న తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వాయిదా వేసిన స్థానిక ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో ఎలాగైనా నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఈ ఏడాది మార్చి 7న ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మొత్తం రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగాలి. తొలిదశలో 333 జెడ్పీటీసీలు, 5వేల 352 ఎంపీటీసీలకు ఎన్నికలకు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా మార్చి 15న ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. అప్పటికే 2వేల 129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఏకగ్రీవాలన్నిటినీ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని ఎస్‌ఈసీకి ఫిర్యాదు కూడా చేశాయి.

Related Posts