YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆప్..మళ్లీ యూపీ అడుగులు

ఆప్..మళ్లీ యూపీ అడుగులు

లక్నో, డిసెంబర్ 24, 
ఢిల్లీలో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగు లేదు. వరసగా మూడోసారి వజియం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. బలమైన బీజేపీ, కాంగ్రెస్ లను కాదని ఢిల్లీ ఓటర్లు ఆయనను వరసగా గెలిపిస్తూ వస్తున్నారు. దానికి కారణం అరవింద్ కేజ్రీవాల్ సంక్షేమ పథకాలతో పాటు ఆయన అమలు పరుస్తున్న వివిధ స్కీమ్ లు ప్రజలకు బాగా చేరువయ్యాయి. దీంతో అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతున్నారు.ఢిల్లీలో గెలిచినంత మాత్రాన ఇతర రాష్ట్రాల్లో గెలుస్తామనుకుంటే అది పొరపాటే. గతంలోనూ గోవాలో ఒక్క స్థానంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవలేకపోయింది. బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించినా తర్వాత ఎందుకో విరమించుకున్నారు. ఇక పొరుగునే ఉన్న పంజాబ్ లో మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ప్రభావం ఎంతో కొంత ఉండవచ్చు. అందుకే ఆయన పంజాబ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రైతుల కోసం ఒక రోజు ఉపవాస దీక్షను కూడా చేశారు.ఆయన తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంగతి ఎవరికీ తెలియంది కాదు. అతి పెద్ద రాష‌్ట్రంతో పాటు కులాలు, మతాలు ఎక్కువ ప్రభావం చూపుతాయి. కులాల ఆధారంగానే అక్కడ పార్టీలు ఏర్డడ్డాయి. శివసేన వంటి పార్టీలు గతంలో పోటీ చేసి చేతులు కాల్చుకున్నాయి. ఎన్సీపీ కూడా బరిలోకి దిగి బావురుమనాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తారనడంపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉండబోతోంది. సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు మాత్రమే ఇక్కడ ప్రభావం చూపనున్నాయి. జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఇక్కడ చతికిల పడింది. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో అరవింద్ కేజ్రీవాల్ ఏమాత్రం ప్రభావం చూపలేరన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా విన్పిస్తున్నాయి. ఆయన ఢిల్లీకే పరిమితమైతే బాగుటుందన్న సూచనలు కూడా వస్తున్నాయి.

Related Posts